Saturday, April 20, 2024
- Advertisement -

స‌రిహ‌ద్దులో మ‌రో విషాదం : 6 గురు జ‌వాన్లు మృతి..

- Advertisement -

పుల్వామా ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే స‌రిహ‌ద్దులో మ‌రో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌కృతి కూడా జ‌వాన్ల‌పై ప‌గ బ‌ట్టింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని నంగ్య రీజియన్ ప్రాంతంలో నేడు మంచు చరియలు విరిగిప‌డి ఆరుగురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. మంచుచరియలు కింద మరికొందరు సైనికులు చిక్కుకోవడంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.ఘటనా సమయంలో ఐటీబీపీతోపాటు స్థానిక జిల్లా పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. ఇప్పటికి ఒక జవాను మృతదేహాన్ని వెలికి తీయగా.. మిగతా వారికోసం రెస్క్యూ టీం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటం, ఘటన జరిగిన ప్రాంతం అత్యంత ఎత్తులో ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో వారం రోజులుగా విపరీతమైన మంచు కురుస్తోంది. హిమపాతం ధాటికి మంచుచరియలు విరిగిపడిన ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -