Wednesday, April 24, 2024
- Advertisement -

జ‌బ‌ర్ధ‌స్త్ వినోద్‌పై హ‌త్యాయ‌త్నం.. తీవ్ర‌ గాయాలు

- Advertisement -

ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఆర్టిస్ట్ వినోద్‌పై దాడి జ‌రిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్‌పై ఒక వ్యక్తి దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాడు. కంటికి బలమైన గాయం అయ్యింది. జులై 19వ తేదీ శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్ సిటీ కుత్బిగూడలో నివాసం ఉంటున్నాడు వినోద్. అర్థరాత్రి సమయంలో ఇంటి యజమానే దాడి చేసినట్లు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వినోద్. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి ఓనర్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుని, విచారిస్తున్నారు. ఈ దాడిలో శరీరంపై గాయాలు అయ్యాయి. కంటి దగ్గర కుట్లు పడ్డాయి. బాగా వాచిపోయింది. నుదటపైనా గాయం అయ్యింది. ఇంటి ఓనర్ ఎందుకు దాడి చేశాడు.. ఇద్దరి మధ్య గొడవ ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం వినోద్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -