Friday, April 19, 2024
- Advertisement -

హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన ఘారాణా కి లేడి మోసం…

- Advertisement -

చదవుకున్న చదువులతో కష్టపడకుండా త్వరగా డబ్బు సంపాదించాలనె ఆలోచనలతో ఆ చదవులను చెడు మార్గాలకు ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ పెరిగిపోయో కొద్ది ఘరాణా మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాల్లలో అబ్బాయిలతో పాటు అమ్మాయులుకూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబద్ లో సరికొత్త ఘరానా లేడీ బాగోతం వెలుగుచూసింది.

బీఎస్సీ చదివిన యువతి ఫేస్ బుక్ నుండి పోటోలు సేకరించి స్కూల్ యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ లకు పాల్పడుతుంది. పేరున్న పలు స్కూల్స్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌ల నుండి అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలు సేకరించడంతో పాటు ఆ ఫోటోలను అసభ్యంగా చిత్రీకరించి తిరిగి తానే తీసేస్తానంటూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్న మాయలేడీ ఆట కట్టించారు సైబర్ క్రైమ్ పోలీసులు.

సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా చెప్పుకునే ఈ కిలాడీ లేడీ స్కూల్స్‌ కు ఫోటోలను పంపి ఫోన్‌లు చేసి బారీగా నగదు డిమాండ్‌ చేసేది. హైదరాబాద్ లో నాలుగు ప్రముఖ పాఠశాలల యాజమాన్యాలను యువతి ఈ విధంగా బెదిరించిందని తెలుస్తోంది. ఒక పాఠశాల యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి యువతిని పట్టుకున్నారు.

పోలీసులు నిందితురాలి మొబైల్ లో 220 కు పైగా స్కూల్ యాజమాన్యాల వాట్సాప్ గ్రూపులు ఉన్నట్లు గుర్తించారు. సులభంగా డబ్బులు సంపాదించాలనె ఆశతోనె ఇలాంటి ఘరాణా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.పాఠశాల యాజమాన్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, టీచర్ల యొక్క ఫోటోలను యువతి మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది.

225 స్కూల్స్ ను ఈ యువతి టార్గెట్ చేసిందని సమాచారం. 20 రోజుల నుండి ఈ యువతి ఇలా చేస్తుందని సమాచారం. సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియాలో గ్రూప్ లో ఉన్నవారు మాత్రమే చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.టీచర్లు, తల్లిదండ్రుల ఫోటోలు మాత్రమే మార్ఫింగ్ చేసిందని విద్యార్థులవి చేయలేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తులో ఉన్నత చదువు చదివి, ఈజీ మనీ కోసం టెక్నాలజీని వాడి ఈ తరహా నేరానికి ఆ యువతి పాల్పడినట్టు తేలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -