అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను దారుణంగా చంపిన భార్య..

679
Illegal affair : Wife who killed her husband by poisoning food
Illegal affair : Wife who killed her husband by poisoning food

అక్రమ సంబంధాలకోసం సొంత వాళ్లను కూడా చంపుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. ప్రతీరోజు ఎక్కడో ఒక చోటు జరగుతూనె ఉంటాయి. తాజాగా తన ప్రియుడితో జల్సా చేసేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని కిరాతకంగా చంపిందో ఇల్లాలు.తాత్కాలిక సుఖం కోసం పవిత్రమైన వివాహ బంధానికే మాయనిమచ్చ తెచ్చి ఇప్పుడు ప్రియుడితో కలిసి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగింది.

వివరాల్లోకి వెల్తే…మండలంలోని మూడు గుడిసెల తండాకు చెందిన మాలోత్ మోహన్ (30), పావని భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన అజ్మీర శ్రీనుతో పావని వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో భర్త దీనిని పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లాడు. పంచాయితీ పెద్దలు పావనిని మందలించారు.

కాని పావని తన ప్రియుడితో రంకు సంబంధం కొనసాగిస్తోంది. తన అక్రమ సంబంధాన్ని నలుగురికి తెలిసేలా చేయడంతో పాటు ప్రియుడిని కలిసేందుకు అడ్డొస్తున్నాడన్న కోపంతో భర్తపై ఆమె పగ పెంచుకుంది. దీంతో భర్త అడ్డును తొలగించుకొనేందుకు పక్కా ప్లాన్ వేసింది. బుధవారం భర్తకు పెట్టిన భోజనంలో విషం కలిపింది. అది తిన్న కాసేపటితో మోహన్ నురగలు కక్కుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో అతడి తల్లి గుర్తించి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో మార్గమద్యలోనె చనిపోయారు.

మోహన్ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టులో విషాహారం తినడం వల్లే అతడు చనిపోయినట్లు తేలడంతో భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు నిజం ఒప్పుకుంది. అక్రమసంబంధానికి అడ్డు వస్తున్నాడనే కోపంతోనె భర్తను చంపినట్లు ఒప్పుకుంది.గూడూరు ఎస్ఐ యాసిన్ నిందితులపై హత్యకేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుపాలు కావడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

Loading...