Saturday, April 20, 2024
- Advertisement -

సౌత్ బేస్‌ను ఆధారంగా చేసుకొని పాకిస్థాన్‌తోపాటు చైనాను టార్గెట్ చేసిన భార‌త్‌

- Advertisement -

భార‌త్‌,చైనా స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న నేప‌థ్యంలో భార‌త్ అనుశ‌క్తి గురింది అమెరికా న్యూక్లియ‌ర్ నిపునులు కొత్త విష‌యాల‌ను వెల్ల‌డించారు.చైనా దేశాన్ని అంత‌టిని టార్గెట్ చేయ‌గ‌ల అణ్వాయుధ వ్య‌వ‌స్థ‌ను భార‌త్ సిద్దం చేసుకుంటోంద‌ని తెలిపారు.ఇండియా వద్ద కనీసం 150 నుంచి 200 న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారీకి అవసరమైన ప్లూటోనియం నిల్వలను భారత్ ఉత్పత్తి చేసిందని ఈ రిపోర్టులో అంచనా వేసిన అణు శాస్త్రవేత్తలు హాన్స్ ఎం కిర్ స్టెన్సన్, రాబర్ట్ ఎస్ నోరిస్ లు వీటితో 120 నుంచి 130 వార్ హెడ్స్ ను సులువుగా తయారు చేయవచ్చని తెలిపారు.150కి పైగా వార్ హెడ్లలో నింపేందుకు 600 కిలోగ్రాముల వెపన్ గ్రేడ్ ప్లూటోనియం అవసరం కాగా, ఆ నిల్వలు ఇప్పటికే భారత్ వద్ద చేరిపోయాయని, ఈ ప్లూటోనియాన్ని న్యూక్లియర్ వార్ హెడ్లలో నింపే పనిలో భారత్ ఉందని తమకు సమాచారం అందినట్టు వారు తెలిపారు.

ఇండియాలో ప్రస్తుతం 7 న్యూక్లియర్ సామర్థ్యమున్న వ్యవస్థలు ఉన్నాయని, వాటిల్లో రెండు విమానాల్లో ఉండగా, నాలుగు భూభాగంగా ఖండాంతర క్షిపణులను ప్రయోగించేలా, మరొకటి సముద్రంలో విహరిస్తూ, విరుచుకుపడేలా భారత్ తయారు చేసుకుందని పేర్కొంది.సాధారణంగా భారత్ అణ్వాయుధ వ్యూహాలు పాకిస్తాన్‌కు అనుగుణంగా ఉంటాయని, ఇప్పుడు చైనాపై కూడా దృష్టి సారించిందంటున్నారు.

భారత దేశం దక్షిణాది కేంద్రంగా మిసైల్స్‌ను అభివృద్ధి చేస్తుందని కూడా పేర్కొన్నారని చెబుతున్నారు. దీనికి కారణం మొత్తం చైనా దేశాన్ని టార్గెట్ చేయడమే కావొచ్చునని అంటున్నారు. చైనా మొత్తాన్ని టార్గెట్ చేసేలా సౌత్ బేస్‌గా మిసైల్ అభివృద్ధి చేస్తోందని చెబుతున్నారు.

120-130 న్యూక్లియర్ వార్ హెడ్స్‌తో మరిన్ని అవసరమని అంచనా వేశారు. భారత్ తయారు చేస్తున్న అగ్ని 2, అగ్ని 1‌లు 2,000 కిలో మీటర్ల టార్గెట్‌ను చేధించగలవని పేర్కొన్నారు. అంటే వెస్టర్న్ చైనా, సౌత్ చైనా, సెంట్రల్ చైనాలను టార్గెట్ చేయగలవని చెప్పారు.

వీటికితోడు మ‌రింత‌ ఆధునికీకరణ దిశగా తయారవుతున్న అగ్ని-4 సిద్ధమై, దాన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రయోగిస్తే, బీజింగ్, షాంపై సహా చైనా మొత్తం దాని పరిధిలోనే ఉంటుందని, ఇక అగ్ని-5 అందుబాటులోకి వస్తే, 5 వేల కిలోమీటర్లలోని లక్ష్యాలను అధి ఛేదిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలతో పాటు చైనాకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో క్షిపణి బేస్ లను నిర్మిస్తోందని ఈ రీసెర్చ్ ఆర్టికల్ లో వ్యాసకర్తలు పేర్కొన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -