21 రోజుల లాక్ డౌన్.. ఏం చేయాలో..? చేయకూడదు ?

778
India goes into 21 day lockdown as coronavirus cases cross 560
India goes into 21 day lockdown as coronavirus cases cross 560

దేశ ప్రధాని మోడీ నిన్న దేశంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. 21 రోజుల పాటు (మూడు వారాలు) దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్లాలని సూచించారు. కరోనా మహమ్మారి కట్టడికి నియంత్రణకు ఇది తప్ప మరో మార్గం లేదని తెలిపారు. జనమంతా ఇళ్లకే పరిమితమైపోవాలి. బయటకు రావడానికి వీల్లేదు. అందరూ ఆంక్షలు పాటించాల్సిందే.. ఈ మేరకు కేంద్రం ‘అపిడమిక్ డిసీజ్ చట్టం’ తీసుకొచ్చింది. కొన్ని రాష్ట్రాలు బయటకొస్తే అరెస్టులు జైలు కూడా విధిస్తామని హెచ్చరించాయి. ఈ మేరకు ఏప్రిల్ 14వరకు దేశంలో ఆంక్షలు మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఇందులో ఏయే సర్వీసులు అందుబాటులో ఉంటాయో.. ఏవి ఉండవో.. ప్రజలు ఏం చేయాలో.. ఏవీ చేయవద్దో.. మొత్తం 13 గైడ్ లైన్స్ లో స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం నిబంధనలు ఇవీ.

ఏమేం తెరిచి ఉంచుతారంటే..
-దేశవ్యాప్తంగా ఆస్పత్రులు

 • మెడికల్ షాపులు – మందులు
  -వైద్య పరికరాలు తయారు చేసే ఫ్యాక్టరీలు
 • వైద్య పరికరాలు – వస్తువులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు
  -క్లినిక్స్ – నర్సింగ్ హోమ్స్ – అంబులెన్స్ ల సేవలు

ఈ రంగంలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలన్నింటికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు

-అత్యవసర సరుకుల తయారీ – రవాణా ఉంటుంది
-బ్యాంకులు – ఏటీఎంలు – ఇన్స్ రెన్స్ ఆఫీసులు నడుస్తాయి
-పాలు – నిత్యవసర సరుకులు – కూరగాయలతోపాటు చేపలు – మాంసం దుకాణాలు తెరిచే ఉంటాయి.
–టెలికమ్యూనిషన్లు – ఇంటర్నెట్ సర్వీసులు – బ్రాడ్ కాస్టింగ్ – కేబుల్ సర్వీసులు – ఐటీ సర్వీసులు కొనసాగుతాయి.
-ఈకామర్స్ ద్వారా మెడిసన్ – ఫుడ్ డెలవరీ సేవలు ఉంటాయి.
-పోలీస్ – సివిల్ డిఫెన్స్ – ఫైర్ – కలెక్టర్ కార్యాలయాలు – విద్యుత్ – శానటరీ – మున్సిపాలిటీలు నడుస్తాయి.

 • ఇవి మూస్తారు
  -ప్రజారవాణా పూర్తిగా బంద్
  -పరిశ్రమలన్నీ మూత
  -విమాన – రైలు – రోడ్డు రవాణా నిలిచిపోవాలి

అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మిక కేంద్రాలు – ప్రార్థనా స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో తెరవడానికి వీల్లేదు..

-దేశంలోని వ్యాపార సంస్థలు 21 రోజుల పాటు బంద్ చేయాలి
-కేంద్రంలోని వివిధ సంస్థలన్నీ ఏప్రిల్ 14 వరకు బంద్

ఇక విదేశాల నుంచి వచ్చిన వారు ఐసోలేషన్ కు వెళ్లాలి. లేదంటే అరెస్ట్ చేస్తారు. 21 రోజుల పాటు శవయాత్రపైనా ఆంక్షలు విధిస్తారు. అంతిమ యాత్రల్లో 20 మందికంటే జనం హాజరు కావద్దని కేంద్రం ఆదేశాల్లో పేర్కొంది.

Loading...