Tuesday, April 23, 2024
- Advertisement -

పాకిస్థాన్‌కు మొద‌టి సారి బిగ్ షాక్ ఇచ్చిన చైనా…

- Advertisement -

తనదాకా వస్తే కానీ అన్నట్లుగా..డ్రాగన్ కంట్రీ చైనాకు పాకిస్థాన్ కుటిల‌త్వం ఆలస్యంగా తెలిసి వ‌చ్చింది. తీవ్ర‌వాదానికి పుట్టినిల్లు అయిన పాక్‌ను ఎప్పుడూ వెనుకేసుకొచ్చే చైతా తాజాగా షాక్ ఇచ్చింది. కరాచీలోని తమ దేశ కాన్సులేట్ పై దాడి జరిగిన తర్వాత ఆ దేశం మేలుకుంది. పాకిస్థాన్ పోర్టు సిటీ కరాచీలో కాల్పుల కలకలం చెలరేగింది.

కరాచీలోని చైనా రాయబార కార్యాలయం సమీపంలోని క్లిప్టన్ ప్రాంతంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. సాయుధులైన నలుగురు వ్యక్తులు చైనా రాయబార కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కాగా ఈ దాడి అనంతరం చైనా తీవ్రంగా స్పందిస్తూ పాక్ కు సిగ్నల్ ఇచ్చింది.

ఓ మ్యాప్ ద్వారా పాకిస్థాన్ కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. కాన్పులేట్పై దాడి జరిగిందంటూ వార్త ప్రసారం చేసిన చైనా అధికారిక చానెల్.. అందులో వాడిన మ్యాప్ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఇండియాలో భాగంగా చూపించింది. ఇలాంటి మ్యాప్ ను చైనా వాడటం ఇదే తొలిసారి. సాధారణంగా మ్యాప్ లకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ఏవి చెబితే అవే అధికారిక చానెల్ వాడుతుంది. అందులో సిబ్బంది వాటిని మార్చడానికి వీలుండదు. ఆ లెక్కన చైనా కావాలనే ఈ మ్యాప్ ను వాడి పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక పంపించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తమ వాళ్లను సంరక్షించడంలో పాకిస్థాన్ విఫలం కావడం పట్ల బీజింగ్ అసంతృప్తితో ఉందని దీన్ని బట్టి అర్థం అవుతోంది. సీజీటీఎన్ టీవీ మ్యాప్‌ల కోసం గతంలో రూపొందించిన టెంప్లెట్స్‌నే ఉపయోగిస్తుంది. వాటిని మార్చడానికి సిబ్బందికి అధికారం లేదు. దీంతో ఉన్నతాధికారుల సూచనలతోనే సీజీటీఎన్ సిబ్బంది భారత్ మ్యాప్‌ను మార్చి ఉంటారని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -