Saturday, April 20, 2024
- Advertisement -

భారత్, పాక్ మధ్య అణుయుద్ధం వస్తే ఎంత నష్టం జరుగుతుంటే….?

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు అణ్వాయుధ దేశాలయిన పాక్, ఇండియా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ సమయమనం పాటిస్తున్నా పాక్ మాత్రం అణుయుద్ధానికి కూడా వెనకాడబోమని దందుడుకుగా ముందుకు వెల్తోంది. అంతర్జాతీయంగా పాక్ కు ఏదేశం మద్దతు తెలుపకపోవడంతో భారత్ పై మరింత రగిలిపోతోంది.జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దుచేసిన తర్వాత పాకిస్థాన్ ప్రధాని పలుసార్లు అణు యుద్ధం గురించి ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితిలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

ఒకవేళ యుద్ధం మొదలైతే.. ఏం జరుగుతుంది..? ఎంత నష్టం జరుగుతుంది?. ఈ యుద్ధం అణు యుద్ధానికి దారితీస్తే.. ఏమౌతుంది..? తాజాగా.. ఈవిషయంపై అధ్యయనం చేశారు అమెరికాలోని రట్‌గర్స్ యూనివర్శిటీ స్టూడెంట్స్.ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకున్న ఉద్రిక్తతలు అణుయుద్ధానికి దారితీస్తే కలిగే పరిణామాలను ఊహించి తమ నివేదికలో పొందుపరిచారు.

భారత్, పాక్‌ల మధ్య పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 నాటికి భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారని, ఈ ఘటనలో అనేక మంది నాయకులు చనిపోతారని తెలిపింది. దానికి ప్రతిగా భారత్ పాక్ అక్రమిత కశ్మీర్ పై దాడిచేస్తుందని…దీంతో పాక్ అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఉందని దాని వల్ల అత్యంత ఘోరమైన యుద్ధానికి దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేసింది.

అణు యుద్ధం ప్రారంభం అయితే కొన్ని వారాల్లోనే సుమారు 16 నుంచి 36 మిలియన్ టన్నుల పొగ వాతావరణాన్ని కప్పేస్తుంది. ఈ దుమ్ము,ధూళి పది సంత్సరాలైనా వాతావరణాన్ని కప్పి ఉంచుతుంది.దీని ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి, భూమి అత్యంత శీతలంగా మారిపోతుందని తెలిపింది.

పొగ కారణంగా.. సూర్యుని నుంచి రేడియేషన్స్ గ్రహించి గాలిని వేడెక్కిస్తుంది. మానవులతో సహా ఏజీవి ఎక్కువ రోజులు జీవించలేవు. వర్షపాతం మందగిస్తుంది. సముద్రాలనుంచి ఆహోరోత్పత్తి తగ్గిపోతుంది.ఒకవేళ ఇరు దేశాలూ అణ్వాయుధాలను ఉపయోగిస్తే కనీసం 125 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. పాక్ కంటే భారత్ లోనె అదిక సంఖ్యలో ప్రజలు చనిపోతారని నివేదికలో పొందుపరిచారు.

ప్రపంచంలోనే 9 దేశాల వద్దనే అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రస్తుతం.. భారత్, పాక్‌ కూడా వీటిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయి. కానీ.. భారత్, పాక్‌ల మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితి ఏర్పాడితే.. మాత్రం పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని.. యూనివర్శిటీ విద్యార్థులు చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -