Saturday, April 20, 2024
- Advertisement -

రెండో టెస్ట్‌లో ప‌డిలేచిన భార‌త్‌….

- Advertisement -

టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ ఆరు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు హారిస్ (70: 141 బంతుల్లో 10×4), అరోన్ ఫించ్ (50: 105 బంతుల్లో 6×4) అర్ధశతకాలు బాదడంతో తొలి సెషన్‌లో తేలిపోయిన టీమిండియా బౌలర్లు.. రెండో సెషన్‌లో పుంజుకుని.. మూడో సెషన్‌లో వరుస వికెట్లతో ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం కనబర్చారు.క్రీజులో కెప్టెన్ టిమ్ పైన్ (16 బ్యాటింగ్: 34 బంతుల్లో 2×4), పాట్ కమిన్స్ (11 బ్యాటింగ్: 29 బంతుల్లో) ఉన్నారు.

టాస్ గెలిచిన ఆసీస్… బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లు హ్యారిస్, ఆరోన్ ఫించ్ డిఫెన్స్‌కే పరిమితమై భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. లంచ్ సమయానికి 26 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా… వికెట్లేమీ కోల్పోకుండా కేవలం 66 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించారు.50 పరుగులు చేసిన ఫించ్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కూంబ్ సైతం విఫలమయ్యారు.

పార్ట్ టైమ్ స్పిన్నర్ అయిన హనుమ విహారి…తొలి రోజు ఆటలో తన స్పిన్ మ్యాజిక్‌తో అందరినీ ఆశ్చర్యపరచాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన ఆసీస్ ఓపెనర్ మార్కస్ హ్యారిస్‌ను బోల్తా కొట్టించి భారత్‌ను పోటీలో నిలిపాడు. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మ (2/35), తెలుగు క్రికెటర్ హనుమ విహారి (2/53) ఫర్వాలేదనిపించగా.. జస్‌ప్రీత్ బుమ్రా (1/41), ఉమేశ్ యాదవ్ (1/68), మహ్మద్ షమీ (0/63) అంచనాల మేర రాణించలేకపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -