Friday, April 19, 2024
- Advertisement -

ధోని భ‌వితవ్యం తేలేది అప్పుడేనా….?

- Advertisement -

వ‌చ్చె నెల‌లో టీమిండియా జ‌ట్టు విండీస్ ప‌ర్య‌ట‌న‌కు సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌పంచ‌క‌ప్ స‌మీఫైన‌ల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన త‌ర్వాత మొద‌టి టూర్‌. ధోని పేవ‌ల బ్యాటింగ్‌తో అన్ని వ‌ర్గాల‌నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నా సంగ‌తి తెలిసిందే. దీంతో ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమని కొందరు విమర్శకులు సూచిస్తున్నారు. మ‌రో వైపు ధోని త‌న క‌ర్త‌వ్యాన్ని స‌రిగ్గా నెర‌వేర్చార‌ని మ‌రి కొంత మంది ఆట‌గాళ్లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. బీసీసీఐ కూడా ధోని రిటైర్మెంట్ తీసుకుంటే బాగుటుంద‌నె సంకేతాలు పంపింది.

ఈనెల 19 విండీస్ టూర్‌కు భార‌త జ‌ట్టును ఎంపిక చేయ‌నున్నారు సెల‌క్ట‌ర్లు. ముంబైలో సమావేశంకానున్న సెలక్టర్లు…వరల్డ్ కప్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే జట్టును ఎంపిక చేయనున్నారు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫేసర్ బుమ్రాకు టీ20, వన్డే సిరీస్‌లకు విశ్రాంతి కల్పించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పిస్తే…రోహిత్ శర్మకు టీ20, వన్డే సిరీస్‌కు సారథ్యపగ్గాలు అప్పగించే అవకాశముంది. కోహ్లీ, రోహిత్ మ‌ధ్య‌నున్న విబేధాల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిస్క‌రించాల‌ని బీసీసీఐ పెద్దులు భావిస్తున్నారు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్న భారత జట్టు…ఆగస్టు 22 తర్వాత రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -