నగ్న సైకిల్ రేసులో పాల్గొన్న భారతీయ మహిళా..!!

1106
indian girl participated in nude race
indian girl participated in nude race

కొంతమంది రికార్డులకు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఓ అమ్మాయి రికార్డు కోసం నగ్నంగా తిరగడం ఇప్పుడు సంచలనం గా మారింది.. వివరాల్లోకి వెళితే నగ్నంగా సైకిల్ తొక్కి ఓ భారతీయ మహిళ ప్రపంచ రికార్డు సృష్టించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. మీనాల్ జైన్ అనే మహిళ లండన్‌లో ఓ ఐటీ కంపెనీని నిర్వహిస్తోంది. ఇటీవల మెల్‌బోర్న్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం ఓ నగ్న ర్యాలీ నిర్వహించింది. ఇందులో ఎంతో మంది మహిళలు పాల్గొనగా..

ఇండియాకు చెందిన మీనాల్ జైన్ కూడా ఈ పోటీలో పాల్గొనడం గమనార్హం. ఒంటి మీద నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా ఆ ర్యాలీలో సైకిల్ తొక్కడం ద్వారా నగ్న ర్యాలీలో పాల్గొన్న తొలి భారతీయురాలిగా మీనాల్ రికార్డు సాధించింది. నగ్నంగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడే ఈ భామ బీచుల్లో కూడా చాలాసార్లు పూర్తి నగ్నంగా తిరిగిందట.

అంతేనా.. లేడీ గోడివా కలం పేరుతో ఓ బ్లాగ్ను కూడా నడుపుతూ.. అందులో నగ్నత్వం గురించి బాగా ప్రచారం చేస్తోంది. అంతేకాదు పుట్టినప్పుడు, పోయేటప్పుడు లేని ఈ దుస్తుల గొడవ మధ్యలో ఎందుకంటోంది. ఏదేమైనా.. ఈ అమ్మడు ఆ ర్యాలీలో పాల్గొని రికార్డ్ సాధించడం పట్ల కొందరు హ్యాపీగా వుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. సంస్కృతికి మారుపేరైన భారతదేశానికి చెందిన ఈ యువతి.. ఇలా నగ్నంగా నడిరోడ్డుపై తిరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Loading...