Saturday, April 20, 2024
- Advertisement -

పెంపుడు మొస‌లి చేతిలో హ‌త‌మైన మ‌హిళా సైంటిస్ట్‌

- Advertisement -

సాదార‌నంగా ఇళ్ల‌లో పెంపుడు జంతువుల‌ను పెంచుకోవ‌డం కామ‌న్‌. కుక్క‌లు, పిల్లులు, కుందేల్లు, ప‌క్షుల‌ను పెంచుకుంటారు. కొంద‌రైతే క్రూర జంతువుల‌ను కూడా పెంచుకుంటారు. పాములు, మొసళ్లు, పులులు వంటి క్రూర మృగాలను పెంచుకుంటే చివరకూ వాటి చేతిలోనే బలి అవ్వాల్సి వస్తుంది. పాముకు పాలు పోసి పెంచినా విషాన్నే కక్కుతుంది అనే సామెత పెద్ద‌లు ఊరిక‌నే పెట్ట‌లేదు. పెంచుకున్న క్రూర జంతువుల చేతిలోనే చివ‌ర‌కు అవ్వాల్సి వ‌స్తోంది. అలాంటి సంఘ‌ట‌నే ఇండోనేషియాలో చోటు చేసుకుంది. పెంపుడు ముస‌లి చేతిలోనే మ‌హిళా సైంటిస్ట్ బ‌ల‌య్యింది.

ఇండోనేషియాలోని ఉత్తర సులావెసీలోని మినాహాసాలో సైంటిస్ట్ మౌల్డ్ తన ఇంటి ముందు ఓ మడుగులాంటి వాటర్ టమ్ ఏర్పాటు చేసి దాంట్లో 14 అగడుగుల ఓ మొసలిని పెంచుతోంది. తానే రోజు స్వ‌యంగా ఆహారం కూడా అందించేది. క్రూర మృగాల్సి సాధుజంతువులుగా పెంచినా వాటి స్వ‌భావం మాన‌దు. పాలు పోసి పెంచిన చేతినే కాటేసిందన్నట్లు ఆ మొసలి యజమానురాలిపై దాడి చేసి క్రూరంగా చంపేసింది.

ముసలికి ఫుడ్ అందించడానికి వెళ్లిన ఆమె చేయిని తినేసింది..తర్వాత పొట్టభాగం కూడా నమిలేసింది.. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాం తయారైంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం మహిళ ఇంటికి వచ్చిన సహోద్యోగులకు దారుణంగా గాయపడిన సైంటిస్ట్‌ మృతదేహం దర్శనమిచ్చింది. వెంటనే వారు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంత‌రం మొస‌లిని వైద్యులు, ఆర్మీ, పోలీసుల సాయంతో మొసలిని శాస్త్రవేత్త ఇంటి నుంచి జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -