Friday, March 29, 2024
- Advertisement -

బస్ కండక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ కాబోతున్నాడు..!

- Advertisement -

ఇప్పుడు ఓ కండక్టర్ సివిల్స్ కు ఎంపికయ్యాడన్న వార్త వైరల్ అవుతోంది. పేద కుటుంబంలో పుట్టి దూరవిద్య ద్వారా చదువుకున్నాడు. కుటుంబం కోసం 19 ఏళ్లకే కండక్టర్ ఉద్యోగంలో చేరాడు. దాంతో కాస్త అర్దికంగా కుదుట పడిన తర్వాత ఉద్యోగం చేస్తూనే సివిల్స్ పరీక్ష కు కష్ట పడ్డాడు.

నిత్యం ఉద్యోగం అయిపోయిన తర్వాత 5 గంటలు చదివేవాడు. బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థలో పనిచేస్తున్న కండక్టర్. బస్సు కండక్టర్ నుంచి ఏకంగా సివిల్స్ కు ఎంపికై అబ్బురపరిచాడు. కర్ణాటకలోని మాండ్య జిల్లా మాలవల్లి గ్రామానికి చెందిన కండక్టర్ మధు తాజాగా యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించాడు. మార్చి 25న నిర్వహించబోయే ఇంటర్వ్యూ కు సిద్దమవుతున్నాడు. ఐఏఎస్ అధికారి అవడమే లక్ష్యంగా ఇంటర్వ్యూ కు సిద్ధమవుతున్నాడు. కోచింగ్ తీసుకున్న సివిల్స్ లో రాణించలేకపోతున్నారు కొందరు.

మధు మాత్రం ఉద్యోగం చేస్తూ పార్ట్ టైమ్ గా చదువుతూ సివిల్స్ కు ఎంపికయ్యాడు. ఇలా సంకల్పం ఉంటే సాధించ లేనిది ఏదీ లేదని.. ప్రతిభకు అడ్డు రాదని.. చదువే మనిషిని నిలబెడుతుందని కండక్టర్ మధు నిరూపించాడు. మంచి స్థాయిలో ఉండాలన్న తపన మనలో ఉంటే ఏదైన సాధించవచ్చని మధు నిరూపించాడు. కండక్టర్ మధు కథ అందరికీ స్ఫూర్తి దాయకం అని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -