Thursday, April 25, 2024
- Advertisement -

జగన్ డేరింగ్ పై జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు

- Advertisement -

ఏపీ సీఎం జగన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. చంద్రబాబు హయాంలో పీపీఏలో పేరుతో విద్యుత్ పంపిణీ సంస్థలకు దోచిపెట్టిన మొత్తాన్ని కక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో సదురు విద్యుత్ కంపెనీలు కోర్టుకెక్కినా.. కేంద్రం వద్దంటున్న సాహసంగా ముందుకెళుతున్నారు.

అయితే కేంద్ర మంత్రి ఇటీవల పీపీఏల రద్దు నిర్ణయం కుదరదని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జాతీయ మీడియాలో కేంద్రం ఆదేశాలతో జగన్ వెనక్కి తగ్గినట్టు తాజాగా కథనాలు వెలువడ్డాయి. జగన్ భయపడినట్టు వార్తలు అల్లారు.

కానీ ఈ విషయంలో జగన్ నిర్ణయం మార్చుకోలేదని తాజాగా ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ఒక మెట్టు ఎక్కడమే తప్ప.. దిగడం ఉండదని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.20వేల కోట్ల భారంతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం బతికి బట్టకట్టాలంటే ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు గత ప్రభుత్వంలో అవినీతి అశ్రిత పక్షపాతంతో ప్రజా సొమ్మును విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు దోచిపెట్టాడని స్పష్టం చేశారు. ఎక్కువ ధరలు చెల్లించిన బాబు సర్కారు ఒప్పందాలను పున: సమీక్షిస్తామని స్పష్టం చేశారు.

మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో జాతీయ మీడియాలో జగన్ వెనక్కి తగ్గారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. పీపీఏల సమీక్ష విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని స్పష్టమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -