వైసీపీని హింసించి ఎటూ కాకుండా పోయాడు..

2055
IPS Officer AB Venkateswara Rao went of Long Leave
IPS Officer AB Venkateswara Rao went of Long Leave

ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం పనిచేయలి.. ఏ రాజకీయ పార్టీకి అనుసంధానంగా కాకుండా నిష్పక్ష పాతంగా వ్యవహరించాలి. కానీ ఇక్కడే దుర్వినియోగం అవుతున్నారు. నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను హింసిస్తున్నారు.

ఇలానే మొన్నటి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ అప్పటి ఏపీ నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీని దెబ్బకొట్టారని స్వయంగా వైసీపీ ఆరోపించింది. టీడీపీని గెలిపించడానికి, వైసీపీనీ దెబ్బకొట్టడానికి ఇంటెలిజెన్స్ ను వినియోగించాడని ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కలిసి ఫిర్యాదు చేసింది..

ఏబీ వెంకటేశ్వరరావు పై ఆరోపణలకు ఆధారాలు కూడా చూపించడంతో మొన్నటి ఎన్నికల వేళ కేంద్రం ఎన్నికల కమిషన్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసింది. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం పట్టుబట్టి ఆయననే నియమించుకుంది.

అయితే ఫలితాలు వచ్చి వైసీపీ ప్రభుత్వం కొలువుదీరాక ఏబీ వెంకటేశ్వరావును బదిలీ చేసి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా వైఎస్ జగన్ సర్కారు వెయిటింగ్ లో పెట్టింది. ఇన్నిరోజులైన పోస్టింగ్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఏబీ ఇప్పుడు లాంగ్ లీవ్ లో వెళ్లారట.. వచ్చాక కూడా ఇవ్వరని సమాచారం అందడంతో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడానికి దరఖాస్తు కూడా చేసుకున్నారట.. ఇలా పార్టీలకు పక్షపాతంగా వ్యవహరిస్తే అధికారులకు ఏమవుతుందో ఏబీని చూస్తే తెలుస్తుందని అధికారులు కథలు కథలుగా చెబుతున్నారు.

Loading...