ఏపీ సీఎం జగన్ ను కలిసిన మెదక్ ఎస్పీ…

1372
IPS officer Chandana Deepti invites to CM YS Jagan to her wedding
IPS officer Chandana Deepti invites to CM YS Jagan to her wedding

తెలంగాణలో యువ ఐపీఎస్ అధికారిణి చందన దీప్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డ్యూటీలో ఉంటూనె సామాజికి పరిస్థితులు, యువతను ఉద్దేశించి స్పూర్తిదాయక సందేశాలు పెడుతూ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పనితీరుతోనే కాకుండా తన అందంతోనూ గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు యువతలో మంచి క్రేజ్ ఉంది.

ఇటీవలే ఎస్పీ చందన దీప్తికి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో ఆమె పెళ్లి వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది.ఈ సందర్భంగా.. ఆమె పెళ్లికి రావాలని.. కోరుతూ.. ఏపీ సీఎం జగన్, వైఎస్ భారతికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ రోజు ఉదయం అమరావతిలోని సీఎం జగన్‌ ఇంటికి.. తనకు కాబోయే భర్తతో వెళ్లి వివాహ పత్రికను అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బంధువుతో చందన దీప్తి పెళ్లి నిశ్చయమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమె పెళ్లికి ఏపీ సీఎం కూడా హాజరుకానున్నారని సమాచారం. చందన దీప్తి వివాహం సందర్భంగా మరోసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించనున్నారు

Loading...