Wednesday, April 24, 2024
- Advertisement -

ఫోన్ ఆధారంగా క‌దిలిన‌ డ్ర‌గ్స్ డొంక‌…

- Advertisement -

టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వినియేగం గ‌త కొంత‌కాలంగా జ‌రుగుతోంది. తెలిసికూడా దాన్ని బ‌య‌ట‌పెట్ట‌కుండా మ్యానేజ్ చేశారు.కాని తెలంగాణా ప్ర‌భుత్వం డ్ర‌గ్స్‌మాఫియామీద ఖ‌టిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో ఇప్పుడు డ్ర‌గ్స్ మాఫియా బ‌ట్ట‌బ‌య‌లైంది.

డ్రగ్స్ కేసులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసి, అందులో నలుగురు కీలక అధికారులను నియమించింది. ఇప్ప‌టికే ప్రముఖ హీరో, టాప్ డైరెక్టర్, ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు జారీ చేసింది..అయితే ఈడొంకంతా క‌ద‌ల‌డానికి కార‌ణండ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ నిందితుల కాల్‌డాటాను పరిశీలించగా, లభించిన ఆధారాలతో అధికారులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. నిన్నటివరకు విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై దృష్టిపెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. ఇప్పుడు టాలీవుడ్ పై నిఘాపెట్టారు.

మత్తు పదార్థాలను సరఫరా చేసేవారు, తరచూ తీసుకునేవారి వివరాలను అధికారులు సేకరించారు. రంగాలవారీగా డ్రగ్స్ రాకెట్‌తో సంబంధం ఉన్నవారిని పిలిపిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ టాలీవుడ్ డొంక మొత్తం కదలటానికి వెనుక కొద్ది రోజుల క్రితమే రోడ్డు ప్రమాదం లో మరణించిన రవితేజ సోదరుడు భరత్ రాజు కాల్స్ లిస్ట్ తీగ కారణం అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

భరత్ రాజు మరణించిన త‌ర్వాత ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న డ్రగ్ సప్లయర్ల నంబర్లనీ, అదే రాకెట్ లో ఉన్న సినీ నటుల వివరాలను సేక‌రించారు అధికార‌లు.సినీ ప్రముఖుల చిట్టా ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికార‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -