Saturday, April 20, 2024
- Advertisement -

పాక్ తో యుద్ధం రాబోతోందా..?

- Advertisement -

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దు తర్వాత సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ కూడా యుద్ధానికి సింద్ధం అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించడంతో భారత్ కూడా సన్నద్ధమవుతుందనె వార్తలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకవేళ పాకిస్తాన్‌ 1965,1971 కాలంలో చేసిన తప్పులను మళ్లీ పునరావృతం చేయాలని చూస్తే.. ఈ సారి ప్రపంచంలోని ఏ శక్తి పాక్‌ను కాపాడలేదంటూ రాజ్ నాధ్ హెచ్చరించారు. ఆర్టికల్‌ 370 రద్దు, కశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ తర్వాత పాక్‌ దుందుడుకుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ హెచ్చరికలు చేయడం ప్రాధన్యత సంతరించుకున్నాయి.

ఓ వైపు యుద్ధం తప్పదని పాక్‌ హూంకరిస్తోంది, మరోవైపు పీఓకే కూడా స్వాధీనం చేసుకుంటామని భారత్‌ నమ్మకంగా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి మూడురోజులుగా సైనిక బలగాలను రోడ్డు, వాయు మార్గాల్లో కశ్మీర్‌కు తరలిస్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తె యుద్ధానికి సంకేతాలుగానె కనిపిస్తున్నాయి.

సైనిక బలగాల తరలింపుపై అధికారులు నోరు మెదపడం లేదు. దేశభద్రకు సంబంధించిన అంశం కావున వివరాలు అడగవద్దని చెబుతున్నారు. వాస్తవానికి 370 ఆర్టికల్‌ రద్దు తర్వాత నుంచి భారీగా బలగాలను కశ్మీర్‌కు తరలిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -