Saturday, April 20, 2024
- Advertisement -

నింగిలోకి మ‌రో ఇస్రో బాహుబ‌ళి….

- Advertisement -

మరో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్దమయ్యింది. ప్ర‌పంచంలో ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగాల్లో దూసుకెల్తున్న ఇస్రో దీన్ని స‌వాలుగా తీసుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ జీఎస్ఎల్‌వీ-ఎఫ్11 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.

ఈ రాకెట్ ప్రయోగానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండుగంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించారు. పంచంలోనే మూడో అతిపెద్ద సైనిక శక్తిగా ఉన్న భారత సైన్యానికి ఇస్రో మరో అస్త్రాన్ని నేడు అందించనుంది. మిలటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ జీ-శాట్ 7ఏ (యాంగ్రీ బర్డ్)ను జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 రాకెట్ ద్వారా నేటి సాయంత్రం 4.10 గంటలకు ప్రయోగించనున్నారు.

జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా పంపుతున్నారు. ఈ ఉపగ్రహం ఎయిర్స్ పోర్స్ సమాచార వ్యవస్థకు దీని సేవలు ఎంతో ఉపయోగపడుతోంది. ఇది విజయవంతమైతే సమాచార రంగంలో భారత్ మరో ముందడుగులోకి చేరుతోంది. 2013లో ప్రయోగించిన జీశాట్-7 కాలపరిమితి మించడంతో దాని స్థానంలో జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని ఇస్రో పంపుతోంది. ఈ ఉపగ్రహం ఎనిమిదేళ్లపాటు సేవలు అందించనుంది.ఈ శాటిలైట్ ప్రయోగం ఈ సంవత్సరం ఇస్రో చేపడుతున్న 17వది కాగా, ఈ సంవత్సరానికి ఇదే చివరిది కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -