Friday, April 19, 2024
- Advertisement -

చంద్రబాబు మాజీ పీఏపై ఐటీరైడ్స్.. 150 కోట్ల ఆస్తుల గుర్తింపు?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబును కేంద్రంలోని బీజేపీ టార్గెట్ చేసిందా? చంద్రబాబు గుట్టుమట్లు అన్నీ తెలిసిన ఆయన పీఏగా చేసిన వ్యక్తిపై ఐటీ రైడ్స్ తో ఇప్పుడు అందరిలోనూ అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పీఏగా పనిచేసిన శ్రీనివాస్ రావుపై తాజాగా 24 గంటలుగా జరుగుతున్న ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. నిన్న ఉదయం నుంచి చంద్రబాబు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్రం పోలీసులు అయిన సీఆర్పీఎఫ్ ను తెచ్చుకొని మరీ ఈ దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఈ దాడుల్లో నమ్మశక్యం లేని విషయాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం అందుతోంది.

శ్రీనివాస్ గత ఏడాది చంద్రబాబు సీఎంగా ఉండే వరకూ ఆయన పీఏగా పనిచేశారు. సెక్రటేరియట్ ఉద్యోగి అయిన శ్రీనివాస్.. చంద్రబాబు పీఏగా ఉన్న సమయంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఐటీ అధికారులు దాడులతో అతడి బండారం బయటపడనుందనే ప్రచారం సాగుతోంది.

చంద్రబాబు మాజీ పీఏ అయిన శ్రీనివాస్ రావుకు విజయవాడతోపాటు హైదరాబాద్ లోని చంపాపేట్ లో ఉన్న ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో అధికారులు ఐటీ తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు అధికారులు గుర్తించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఐటీ అధికారులు మాత్రం ఇంతవరకూ అధికారికంగా వెల్లడించలేదు.

చంద్రబాబు పీఏగా ఉన్న శ్రీనివాస్ రావుకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఐదేళ్లలోనే ఇన్ని కోట్లకు అధిపతిగా మారడం వెనుక కారణమేంటి? అతడికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయన్నది ఐటీ అధికారులు ఆరాతీస్తున్నారు. నోటీసులు అందించి కేసులు నమోదు చేయడానికి రెడీ అయ్యారు.

చంద్రబాబు పీఏ ఆస్తులను తవ్వుతున్న ఐటీ అధికారులు చివరకు ఆయన కాడి తవ్వితే ఎవరిదగ్గర ఆగుతుందనే ఉత్కంఠ టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్న ప్రచారం సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -