Friday, March 29, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్‌కు ఇవాంకా లేఖ‌

- Advertisement -
  • ఆతిథ్యానికి ఫిదాయ్యాయ‌ని ప్ర‌శంస‌
  • మ‌ళ్లీ త్వ‌ర‌లో వ‌స్తాన‌ని ప్ర‌క‌ట‌న‌

ఆసియా ఖండంలోనే తొలిసారిగా హైద‌రాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్ర‌తిష్టాత్మ‌కంగా కేంద్ర ప్ర‌భుత్వంతో క‌లిసి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించింది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఓ నెల రోజుల నుంచి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకొని చేయించారు. ఇక స‌ద‌స్సుకు హాజ‌రైన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, అమెరికా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ఇవాంకా ట్రంప్ హాజ‌రైంది. ఆమెకు ఏ అతిథికి చేయ‌ని విధంగా రాచ మ‌ర్యాద‌లు చేశారు. హైదరాబాద్ మునుపెన్న‌డు లేనివిధంగా ముస్తాబైంది. ఇవాంకా ఉన్న‌న్ని రోజులు ఆమెకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా తెలంగాణ ప్ర‌భుత్వం చేసింది. భ‌ద్ర‌త నుంచి ఆహారం, వ‌స‌తి త‌దిత‌ర ఇలా అన్నీ ఏర్పాట్లు ద‌గ్గ‌రుండి ఆమెకు న‌చ్చిన‌ట్టు చేశారు. కోట్లు కుమ్మ‌రించి ఆమె సేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. దీంతో ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్‌కు ఫిదా అయ్యింది.

స‌ద‌స్సులోనే చెప్పింది హైద‌రాబాద్‌ను మ‌రువ‌లేన‌ని.. మ‌ళ్లీ ఇక్క‌డ‌కు ఎప్పుడెప్పుడు రావాల‌ని ఉంద‌ని, హైద‌రాబాద్ విడిచి వెళ్లాల్సి రావ‌డం బాధ‌క‌ర‌మ‌ని చెబుతూ ఫ్లైటెక్కింది.

ఇక ఇంత చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ర్యాదల‌ను అమెరికా పోయినా ఇవాంకా మ‌రువలేక‌పోతోంది. వారానికో, నెల‌కోసారైనా గుర్తుచేసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావుకు, తెలంగాణ‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ఓ లేఖ‌ను సోమ‌వారం పంపించింది. వైట్‌హౌస్ నుంచి లేఖ తెలంగాణ ప్ర‌భుత్వానికి వ‌చ్చింది.

`తన హైదరాబాద్‌ పర్యటన ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన అనుభవమని పేర్కొన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం అందజేసిన కానుక విషయంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, రాష్ట్ర ప్రజలు చూపిన ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందని తెలిపారు. త్వరలోనే మళ్లీ భారత్‌కు తిరిగి రావాలని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -