Friday, April 26, 2024
- Advertisement -

జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ చలాకీ చంటికి తృటిలో తప్పిన పెను ప్రమాదం…

- Advertisement -

తెలుగులో బాగా ఫేమస్ అయిన కామెడీ షో ‘జబర్దస్త్‌’లో నటించే చలాకీ చంటికి ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ వద్ద చంటి కారు ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదం నుంచి స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

ప్ర‌మాద సమాచారం అందుకున్న వెంటనే కోదాడ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. చంటిని కోదాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.ప్రమాదానికి కారణమైన కారును అక్కడి నుంచి తరలించి జాతీయ రహదారిపై వాహన రాకపోకలను పునరుద్ధరించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు ప్రత్యేక వాహనంలో తరలించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

చలాకీ చంటిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన చంటి జబర్దస్త్‌ షోతో పాటు అనేక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా చేస్తున్నారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు. చంటికి గతేడాది జూన్‌ నెలలోనూ కారు ప్రమాదం జరిగింది. 2018 జూన్ 12న మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం కాగా.. చంటి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -