Tuesday, April 23, 2024
- Advertisement -

ఉండ‌వ‌ల్లిలో రైతుల‌తో ప‌వ‌న్ భేటీ…ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్న చిన‌రాజ‌ప్ప‌

- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జనసేనుడు అక్క‌డి రైతుల‌తో పంట పొలాల్లోనే భేటీ అయ్యారు. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం రైతులు వచ్చారు. పలు పొలాలు తిరిగి పంటలు ఎలా పండుతున్నాయో చూశారు. ఈ సంద‌ర్భంగా రైతులు త‌మ ఆవేద‌న‌ను ప‌వ‌న్ ద‌గ్గ‌రు చెప్పుకున్నారు.

తమ పొలాల్లోకి వెళ్లేందుకు కూడా ఆధార్ కార్డు చూపించాల్సి వస్తోందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సంవత్సరాలుగా నిద్రలేని రాత్రులను తాము గడుపుతున్నామని… ఏ క్షణాన భూములను లాక్కుంటారోనని భయపడుతున్నామని చెప్పారు. తమ భూముల్లో పంటలు పండటం లేదంటూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మరో రైతు తెలిపారు. 2014 ఎన్నిక‌ల్లో చంద్రబాబు చెప్పులు లేకుండా వచ్చి తమను ఓట్లు అడిగారన్నారు. ఇప్పుడు మమ్మల్నే గెంటి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీనీ ఓడిస్తామ‌ని ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను హోంమంత్రి చిన‌రాజ‌ప్ప ఖండించారు. లుగుదేశం పార్టీని ఓడించేంత శక్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేదన్నారు. జగన్, పవన్ కల్యాణ్ లు బీజేపీతో కుమ్మక్కై… టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గురించి వీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు.

జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని, పవన్ కల్యాణ్ కు జ్ఞానం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేందుకే వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిందని విమ‌ర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -