Thursday, April 25, 2024
- Advertisement -

ట్విట్టర్ షాక్ కు విలవిల్లాడుతున్న జనసేన

- Advertisement -

జనసేన పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. సంస్థాగంతంగా పార్టీకి బలం లేకపోయినా సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలను తీసుకెల్తున్నారు జనసైనికులు. అయితే తాజాగా ఆ పార్టీకి ట్విట్టర్ బిగ్ షాక్ ఇచ్చింది. పార్టీకి చెందిన 400 ఖాతాలను ఇటీవల ట్విట్టర్ సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి, భారీ ఫాలోయింగ్ ఉన్న ట్రెండ్ పీఎస్ పీకే, పవనిజం నెట్ వర్క్, వరల్డ్ పీఎస్ పీకే ఫ్యాన్స్, దాస్ పీఎస్ పీకే వంటి ఖాతాలను కూడా బ్లాక్ చేసేసింది. దీనిపై జనసేన అధినేత పవన్, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొద్ది రోజులుగా జ‌న‌సైనికులు పవ‌న్ పిలుపు మేర‌కు నల్లమల అడవిలోని యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్ర‌చారం చేస్తున్నారు. వైస్ జ‌గ‌న్ ఫేయిల్డ్ యాస్ సీఎం తో పాటు సేవ్ న‌ల్ల‌మ‌ల అనే యాష్ ట్యాగ్‌తో మ‌రి ట్రెండ్ చేస్తున్నారు. ఇది ట్విట్ట‌ర్ ప్లాట్‌ఫాం నిబంధ‌న‌ల‌కి విరుద్దం. ఆ కారనంగానె మీ ట్విట్టర్ అకౌంట్లను సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ని మెయిల్ వ‌చ్చాయ‌ట‌.

ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేన మద్దతుదారులకు సంబంధించి 400 అకౌంట్లను ట్విట్టర్ ఎందుకు సస్పెండ్ చేసిందో తనకు తెలియడం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. తమ సామాజిక మాధ్యమ ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జనసేనాని ట్విట్టర్ లో స్పందించారు.

ఇక జనసైనికులు కూడా మండిపడుతున్నారు. ఇదంతా వైసీపీ కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జగన్ తనకు నచ్చని న్యూస్ చానళ్లను, సోషల్ మీడియా ఖాతాలను క్లోజ్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.300 ఖాతాలను సస్పెండ్ చేయిస్తే 3000 ఖాతాలను సృష్టిస్తా మంటూ సవాల్ విసురుతున్నారు.

సేమ్ నల్లమల క్యాంపెయిన్ ఇతర పార్టీలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీల అకౌంట్లు యధావిధిగా కొనసాగుతున్నాయని, కేవలం జగన్ ఫెయిల్యూర్ సీఎం క్యాంపెయిన్ వల్లే తమ అకౌంట్లను సస్పెండ్ చేయించారని చెప్తున్నారు జనసైనికులు.వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా, జనసేన కార్యకర్తలు ముందుకు వెళ్తూనే ఉంటారని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -