Thursday, March 28, 2024
- Advertisement -

ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు అది పెట్టుకోవద్దు

- Advertisement -

ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు కాదని నేటి ఆధునిక సమాజం చూస్తే అర్థమవుతోంది. మగవాళ్లతో సరిసమానంగా వారు రాణిస్తున్నారు. అయితే ఇప్పటికీ వారికి పనిచేసే చోట ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా జపాన్ లోని కొన్ని కంపెనీలు మహిళలకు ఓ వింత నిబంధన పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

తాజాగా జపాన్ లోని కొన్ని కంపెనీలు ఆడవాళ్లను కళ్లద్దాలు పెట్టుకొని ఆఫీసుకు రావద్దని ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. కొన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా భద్రత నేపథ్యంలోని మహిళలను కళ్లద్దాలు ధరించవద్దని పేర్కొన్నాయి.

ఇలా కళ్లద్దాలు పెట్టుకోవద్దనడానికి పెద్దగా కారణాలు కూడా లేకపోవడం గమనార్హం. ఆఫీసులో కళ్లద్దాలు పెట్టుకున్న మహిళలు సీరియస్ గా కనిపిస్తారట.. వారి అందాన్ని అద్దాలు డామినేట్ చేస్తాయని.. మరీ ఇంటెలిజెంట్లుగా కనిపిస్తారని ఇలా వింత సాకులు చెబుతూ మహిళలు కళ్లద్దాలు పెట్టుకోకుండా ఆయా కంపెనీలు నిషేధం విధించాయి.

దీనిపై జపాన్ లోని మహిళా లోకం భగ్గుమంది. ‘గ్లాసెస్ ఆర్ ఫోర్ బిడ్డెన్’ అనే హ్యాష్ ట్యాగ్ తో మహిళలు సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నారు. మరి ఆయా కంపెనీలు, ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తాయన్నది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -