జేసీ ప్రభాకర్‌ రెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డి అరెస్ట్‌

- Advertisement -


తాడిపత్రి మాజీ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి తో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో అనంతపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నా అనంతరం వీరిని హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు.

బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత బీఎస్ ‌ 3 వాహనాలను నకిలీ పత్రాల సాయంతో కొత్త వాహనాలుగా రిజిస్ట్రేషన్లు చేయించినట్టు గుర్తించారు. అనంతపురం, తాడిపత్రి పోలీస్ స్టేషన్ లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటికే 27 కేసులు నమోదు అయ్యాయి. అందులో 24 కేసులు నకిలీ రిజిస్ట్రేషన్ లకు సంబంధించినవే.

- Advertisement -

వాటికి సంబంధించిన ఫేక్‌ ఎన్‌ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాల సాయంతో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇప్పటికే 60 వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. మరో 94 వాహనాలను జేసీ బ్రదర్స్ దాచిపెట్టారని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని లారీలను బస్సులుగా మార్చి నడుపుతున్నట్టు గుర్తించి కేసు నమోదు చేశారు.

Most Popular

పవన్ తో సినిమా చేస్తున్న ఈ దర్శకుడు ఎవరో తెలుసా ?

పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు అని తెలిసినప్పటి నుండి ఆయన ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి కంటెంట్ ఉన్న మూవీ...

‘ఆర్.ఆర్.ఆర్’ రామరాజు, భీమ్ టీజర్లలో ఈ పాయింట్స్ గమనించారా ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తుండగా.. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రాంచరణ్ పుట్టినరోజు నాడు...

యాడ్స్ లో చేస్తున్న మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా ?

టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు కు ఎలాంటీ క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అందుకే అతడ్ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంటారు. ఈ యాడ్స్‌తోనే మహేష్ ఏడాదికి భారీగా సంపాధిస్తున్నాడు. థమ్స్అప్...

Related Articles

వైసీపీలో చేరుతా.. కానీ ఆ పని చేయాలి : జేసీ సంచలన వ్యాఖ్యలు

తమపై రాజకీయ వేధింపుల్లో భాగంగానే అక్రమంగా కేసులు పెట్టారని జేసి ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. తమ ట్రావెల్స్ వాహనాలకు సంబంధించి అన్ని నిబంధనలు పాటించినప్పటికి తమపై కావాలనే కేసులు...

ప్రజల డబ్బు పందికొక్కుల్లా తిన్నా.. వదిలేయాలా..?

ప్రజాసొమ్ము పైసా కూడా వృథా కాకుండా కాపాడుతానని, ప్రజల డబ్బును ఎవరు తిన్నా.. కక్కిస్తానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆనాడే చెప్పారని, చెప్పిన మాట ప్రకారం అవినీతిపై యుద్ధం మొదలుపెట్టారని...

బట్టలు లేకుండా నిలబెట్టాడు.. నన్ను అరెస్ట్ చేయొచ్చు : జేసీ

జేసీ ప్రభాకర్రెడ్డి అరెస్ట్ పై మాజీ ఎంపీ దివాకర్రెడ్డి స్పందించారు. ప్రభాకర్రెడ్డి పై ఆరోపణలు వాస్తవేమనని.. అయితే అస్మిత్ రెడ్డికి ఏ తెలియదని అన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు....
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...