జమ్మూకశ్మీర్ లోకి చొరబడ్డ ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను కాల్చి చంపిన భ‌ద్ర‌తాద‌ళాలు

149
J&K:Security forces killed two terrorist in Gopalpora area of Kulgam District
J&K:Security forces killed two terrorist in Gopalpora area of Kulgam District

జమ్మూకశ్మీర్ కి ప్ర‌వేశించిన ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్సి చంపాయి. కుల్గామ్ జిల్లాలో ఈరోజు భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంట‌ర్ ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు చ‌నిపోయారు. జిల్లాలోని గోపాల్ పొర ప్రాంతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతాబలగాలకు నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుమట్టి కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి.

జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో, భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ముగ్గురు ఉగ్రవాదులు ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్న బలగాలు, పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు

Loading...