Saturday, April 20, 2024
- Advertisement -

కుట్ర‌ను ఛేదించిన భార‌త్‌, బంగ్లానిఘాల వ‌ర్గాలు…

- Advertisement -

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు పెను ప్రమాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఆమెను దారుణంగా హత్య చేసేందుకు ఆమె సెక్యూరిటీ గార్డ్స్ చేసిన కుట్ర‌ల‌ను ఇంటిజెన్సీ భ‌గ్నం చేయ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. ఒకప్పుడు ఇందిరాగాంధీని ఆమె సెక్యూరిటీనే ఎలా హతమార్చిందో ఆ తీరుగానే హసీనాను చంపేయాలనుకున్నారు. అయితే, ముందస్తుగా తేరుకున్న నిఘా విభాగం ఆమెను ఈ ప్రమాదం నుంచి బయటపెట్టింది.అక్కడి పోలీసులు, నిఘా వర్గాల సమాచారం ప్రకారం గత ఆగస్టు 24నే హసీనాను హత్య చేద్దామని అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వివిరాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

మొత్తం నాలుగు నిఘా వర్గాలు ఈ ఇన్‌పుట్స్‌ అందించగా అందులో రెండు సంస్థలు బంగ్లావి కాగా.. మరో రెండు భారత్‌కు చెందిన నిఘా సంస్థలు ఈ వివరాలు అందించాయి. వాటి ప్రకారం హసీనా భద్రతను చూసుకునే స్పెషల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(ఎస్‌ఎస్‌ఎఫ్‌)కు చెందిన ఆరు నుంచి ఏడుగురు గార్డ్స్‌ ఇందుకు ప్లాన్‌ చేశారు.

ఆ రోజు సాయంత్రం హసీనా తన కార్యాలయంలో పనులు పూర్తి చేసుకొని బయటకు రాగానే ఆమెపై దాడి చేయాలని భావించారు. ఆ తర్వాత వారు పారిపోయేలా ఆ భవనం చుట్టు బాంబులు పేల్చి వేసి గందరగోళం సృష్టించి ఆ సమయంలో పరారవ్వాలని కూడా కుట్ర చేశారు. ఇదంతా కూడా జమాత్‌ ఉల్‌ ముజాహీదీన్‌(జేఎంబీ) ఉగ్రవాదులు ఎస్‌ఎస్‌ఎఫ్‌ గార్డులు కలసి ప్లాన్‌ చేసినట్లు వెల్లడించారు.

ఇదంతా కూడా జమాత్‌ ఉల్‌ ముజాహీదీన్‌(జేఎంబీ) ఉగ్రవాదులు ఎస్‌ఎస్‌ఎఫ్‌ గార్డులు కలసి ప్లాన్‌ చేసినట్లు వెల్లడించారు. అయితే, భారత్‌, బంగ్లాదేశ్‌ నిఘా వర్గాల పరస్పర సహకారంతో జేఎంబీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌ గార్డుల సంభాషణల గుట్టు తేల్చగలిగామని, కుట్రలు భగ్నం చేశామని తెలిపారు. ఇప్పటికే కొంతమంది గార్డులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, మిగితా వారిని కూడా అదుపులోకి తీసుకొని ఈ కుట్రలో ఎవరి భాగస్వామ్యం ఉన్నవారెవ్వరినీ విడిచిపెట్టకుండా శిక్షిస్థామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -