కేటాక్స్ రగడ.. కోడెల కొంపు కొల్లరేనా?

317
K-Tax Effect to Former AP Speaker Kodela Family Goes hiding
K-Tax Effect to Former AP Speaker Kodela Family Goes hiding

గడిచిన టీడీపీ ప్రభుత్వం ఏపీ శాసనసభా స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది. వైసీపీ అధికారంలోకి రావడంతో కోడెల ఆగడాలపై బాధితులు పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు. విశేషం ఏంటంటే ఇందులో టీడీపీ నాయకులే ఎక్కువగా ఉండడం విస్తు గొలుపుతోంది.

నియోజకవర్గంలో ప్రతీ పనికి ఒక రేటును ఫిక్స్ చేసి వీధి చివర దుకాణాల నుంచి బడా బిల్డర్ల వరకూ లంచాలు వసూలు చేసిన వ్యవహారంపై బాధితులు ఒక్కరొక్కరుగా పోలీస్ స్టేషన్ గడుపుతొక్కుతున్నారు. కోడెల కుమారుడు శివరాజ్, కుమార్తె విజయలక్ష్మీలపై తాజాగా కేసులు నమోదయ్యాయి.

తాజాగా సత్తుపల్లిలో ఓ మద్యం వ్యాపారి తన వద్ద నుంచి 44లక్షలు వసూలుచేశారని కోడెల కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కోడెల కుమార్తె కూడా 3 లక్షలు వసూలు చేసింది మరో చిరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా సత్తెనపల్లి, నరసారావుపేటలో పదులసంఖ్యలో బాధితులు కోడెల ఫ్యామిలీపై ఫిర్యాదులు చేస్తున్నారు..

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉండడం.. కోడెల ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో పోలీసులు కూడా దీనిపై యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయ్యారు. వేగంగా స్పందిస్తూ విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా వరుస కేసులతో కోడెల కుమార్తె, కుమారుడు పరారీలో ఉన్నట్టు సమాచారం.

Loading...