Tuesday, April 23, 2024
- Advertisement -

ఓట‌ర్ల జాబితాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫోటో.. దీపిక ప‌దుకొనే పేరు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ లిస్ట్‌పై ఇప్పటికే ఎన్నో అనుమానాలున్నాయి. ఓట‌ర్ల లిస్ట్‌లో కొత్త వారిపేర్లు చేర్చ‌డం….లేని వారి పేర్లు తీసేయ‌డం కామ‌న్‌. అయితే అధికారులు చేసే చిన్న త‌ప్పులు ఆస‌క్తిక‌రంగానే ఉంటాయి. చ‌నిపోయిన వ్య‌క్తికి ఓట‌ర్ల జాబితాలో చోటు ఇవ్వ‌డం.. చ‌నిపోయిన వ్య‌క్తి వ‌చ్చి ఓటేయ‌డం ఇవ‌న్నీ ఎన్నిక‌ల స‌యంలో సిత్రాలే. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఓట్ల తొల‌గింపుపై అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య ఓమోస్త‌రుయుద్ద‌మే జ‌రుగుతోంది. కొన్ని సార్లు అధికారులు చేసె సిత్రాలు అంద‌రికీ న‌వ్వు తెప్పిస్తుంటాయి.

ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ముఖ్యంగా ఓట‌ర్ల జాబితా విడుద‌లైన‌పుడు చాలా కామెడీ ఉంటుంది. తెలియ‌కుండా జ‌రిగే పొర‌పాట్లు ఫ‌న్ జ‌న‌రేట్ చేస్తుంటాయి. అలాంటి సిత్ర‌మే రాజ‌మండ్రిలో చోటు చేసుకుంది. ఓట‌ర్ల జాబితాలో రాష్ట్రానికి సంబంధంలేని సెలబ్రిటీలు ఓటర్ లిస్ట్‌లో దర్శనమిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఓ హీరోయిన్ ఫోటో పెట్టి.. మ‌రో హీరోయిన్ పేరు రాసి కామెడీ చేసారు ఎన్నిక‌ల అధికారులు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ చేరిపోయింది. అయితే, దీపికా పేరున్నా… ఫొటో మాత్రం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ది కావడం మరో విశేషం. అక్క‌డ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ సినిమాలోని కాజ‌ల్ ఫోటో వాడుకుని ఓట‌ర్ల జాబితాలో చేర్చారు. పైగా కాజ‌ల్ ఫోటో వేసి కింద దీపిక పేరు వేసారు. ఆమె తండ్రి పేరు ర‌మేష్ కొండా అని.. వ‌య‌సు 22 అని అచ్చేసారు. ఇప్పుడు ఓ ఓట‌ర్ జాబితా చూసి అంతా షాక్ అవుతున్నారు. స్థానికి ప్ర‌జ‌లు అధికారుల‌పై గుస్సా అవుతున్నారు. దీంతో త‌మ త‌ప్పుని స‌రిదిద్దుకొనే ప‌నిలో ప‌డ్డారు అధికారులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -