Friday, March 29, 2024
- Advertisement -

షాకింగ్… స్పీకర్ కోడెల బోనెక్కాల్సిందే…. కోర్ట్ ఆదేశాలు

- Advertisement -

ఒకవైపు చంద్రబాబునాయుడేమో కోర్టులను గౌరవిస్తూ విచారణలకు హాజరుకావడాన్ని తప్పు పడుతూ ఉంటాడు. ఆయన భజన బ్యాచ్ ప్రథమ సభ్యుడు రాధాకృష్ణతో సహా చాలా మంది కోర్టుకు హాజరుకాకుండా ఉండడం కోసం స్టేలు తెచ్చుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ ఈ స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబు దేశంలోనే సీనియర్ అనుకోండి. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కోర్టుకు హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది.

ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి 11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆ మధ్య ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఖర్చు కంటే ఇది చాలా రెట్లు ఎక్కువ. అన్నింటికీ మించి ఎన్నికల అఫిడవిట్‌లో ఈ స్థాయి ఆస్తులను కోడెల చూపించలేదు. ఈ నేపథ్యంలోనే నేరం రుజువైతే కోడెలకు శిక్ష తప్పదు. అందుకే కోడెల వ్యాఖ్యలపై కరీంనగర్‌కి చెందిన సింగిరెడ్డి భాస్కరరెడ్డి స్పెషల్ కోర్ట్‌లో కేసు వేశాడు. ఈ కేసు విషయంలో కోర్ట్‌కి హాజరుకావాలని కోడెలను ఆదేశించింది కోర్ట్. అయితే కోడెల మాత్రం వ్యక్తిగతంగా హాజరుకాలేనని విన్నవించుకున్నాడు. అయితే కోర్టు మాత్రం కోడెల విన్నపాన్ని పట్టించుకోలేదు. ఈ నెల 18న కోడెల స్వయంగా కోర్ట్‌కి హాజరు కావాల్సిందేనని కోర్టు తాజాగా ఆదేశాలు జారీచేసింది. గౌరవనీయ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి కోర్టు బోను ఎక్కడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో విమర్శలు చేస్తాడో చూడాలి మరి. లేకపోతే ఇక్కడ కూడా అన్ని విషయాల్లోలాగానే….. తాము చేస్తే శృంగారం……పక్కోడు చేస్తే వ్యభిచారం….అన్న పచ్చ కళ్ళ థీరీనే ఫాలో అవుతాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -