Saturday, April 20, 2024
- Advertisement -

సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌-జేడీఎస్‌కు ఎదురుదెబ్బ‌…

- Advertisement -

ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపయ్య నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది వారి పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రొటెం స్పీకర్ స‌మ‌క్షంలో బలపరీక్షను నిర్వహించేందుకు అత్యున్నత ధర్మాసనం అంగీకరించింది. ఇది భాజాపాకు క‌ల‌సి వ‌చ్చే అంశం.

ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమించాలో గవర్నర్‌కు సూచించేలా చట్టేలేవీ లేవని న్యాయస్థానం వెల్లడించింది. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అసెంబ్లీ కార్యకలాపాలను అన్ని ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించింది. బలపరీక్షను డివిజన్ ఓటు ప్రకారమే నిర్వహించాలని ఆదేశించింది. ప్రోటెమ్ స్పీక‌ర్‌పై విచారించాలంటే టైం ప‌డుతుందని అందుకు బ‌ల‌ప‌నిరూప‌ణ ప‌రీక్ష‌ను వాయిదా వేయాల్సి వ‌స్తుంద‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది.

బోపయ్య అందరి కంటే సీనియర్ ఎమ్మెల్యే కాదని, సీనియార్టీ ఎక్కువ ఉన్నవారికే ప్రొటెం స్పీకర్‌గా అవకాశం ఇవ్వడం సంప్రదాయమని కపిల్ సిబల్ వాదించారు. కాగా, సీనియర్ కాని వ్యక్తిని కూడా ప్రొటెం స్పీకర్‌గా నియమించిన సందర్భాలు ఉన్నాయని సుప్రీం తెలిపింది. కాంగ్రెస్ తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. బీజేపీ తరఫున ముకుల్ రోహత్గి వాదించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -