Saturday, April 20, 2024
- Advertisement -

పాక్ వెల్లనున్న మాజీ ప్రధాని…

- Advertisement -

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాక్ వెల్లనున్నారు.క‌ర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్స‌వ వేడుక‌లో ఆయ‌న పాల్గోనున్నారు.నవంబర్ 12న గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 9న కర్తార్‌పూర్ గురుద్వారాకు తొలివిడత భక్తులతో కలిసి వెళ్లడానికి మన్మోహన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కర్తార్‌పూర్ కు రావాల్సిందిగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖరేషి ఇప్పటికే ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా వెల్లనున్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మొదట కర్తార్‌పూర్ గురుద్వారాకు వెల్లకూడదని మన్మోహన్ సింగ్ నిర్ణయించుకున్నారు. ఆఖిల ప‌క్ష పార్టీ నేత‌ల‌తో క‌లిసి పాక్‌కు మ‌న్మోహ‌న్ వెళ్ల‌నున్న‌ట్లు తాజాగా తెలిసింది. గురునాన‌క్ 550వ జయంతి వేడుక‌ల్లో మాజీ ప్ర‌ధాని మన్మోహ‌న్ పాల్గొంటారు.

పాకిస్థాన్ దర్బార్ సాహిబ్‌ ఎంతో చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. సిక్కు మత గురువు గురునానక్ తన జీవిత కాలంలో చివరి 18 ఏళ్లు ఇక్కడే సేదతీరినట్టుగా సిక్కులు భావిస్తారు. అందుకే ఈ గురుద్వారాను ప్రతి సిక్కు మతస్తుడు దర్శించుకుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -