Saturday, April 20, 2024
- Advertisement -

కవిత వర్కింగ్ ప్రెసిడెంటా? రాజ్యసభకా?

- Advertisement -

ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చుట్టూ రాజకీయం నడుస్తోంది. కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం లాంఛనమేనన్న చర్చ సాగుతోంది. మరీ కేటీఆర్ మంత్రి అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతారా? లేక దానికి రాజీనామా చేసి జోడు పదవులు వద్దని కేవలం మంత్రిగానే నడుస్తారా అన్న టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. కేటీఆర్ ను మంత్రిని చేసి జోడు పదవులు లేకుండా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కవితకు ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. కేసీఆర్ ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం

ఇక నిజామాబాద్ ఎంపీగా ఓడిన కవితను రాజ్యసభకు కేసీఆర్ పంపించబోతున్నారనే చర్చ సాగుతోంది. కవితకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేదా రాజ్యసభ ఎంపీ పదవి.. ఈ రెండింటో ఒకటి దక్కడం ఖాయమని అనుకుంటున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తన వారసుడిగా కేటీఆర్ ను కేసీఆర్ ప్రొజెక్ట్ చేస్తున్నారు.ఆ కోవలోనే పార్టీ పగ్గాలు అప్పగించారు. ఇప్పుడు మంత్రిని కూడా చేయబోతున్నారు. మరి అందరూ జోడు పదవులు అంటున్నా పార్టీపై గుత్తాధిపత్యం వహించే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కేటీఆర్ కే కేసీఆర్ ఉంచుతారనే చర్చ సాగుతోంది. కవితను రాజ్యసభకు పంపే వీలుందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -