Friday, March 29, 2024
- Advertisement -

పంతం నీదా నాదా? కేసీఆర్ డెడ్ లైన్ పై ఉత్కంఠ.?

- Advertisement -

తెలంగాణలో ఈరోజు ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పరిష్కారం అనేది ఈరోజుతో తేలిపోనుంది. మొన్ననే కేసీఆర్ విలేకరుల సమావేశంలో ఈనెల 5వ తారీఖులోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరితే ఆర్టీసీ ఉంటుందని లేదంటే మొత్తంగా ప్రైవేటీకరణ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ పెట్టిన కౌంట్ డౌన్ మొదలైంది.

ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి కేసీఆర్ గడువు విధించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పదుల సంఖ్యలో కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 49వేల మందిలో ఈ సంఖ్య చాలా తక్కువ.

అయితే కేసీఆర్ డెడ్ లైన్ పై ఆర్టీసీ కార్మిక సంఘాలు, నాయకులు వెనక్కి తగ్గడం లేదు. కార్మికులు కూడా సమ్మెలోనే ఉంటున్నారు. కేసీఆర్ బెదిరింపులకు లొంగకుండా విధుల్లోకి రావడం లేదు. కోర్టులు, రాజకీయ పార్టీల ద్వారా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈరోజు సమయం గడుస్తున్న కొద్ది కేసీఆర్ పంత నెగ్గుతుందా. ? కార్మికుల పట్టుదల పనిచేస్తుందా అన్న ఉత్కంఠ యావత్ తెలంగాణలో వ్యక్తమవుతుంది. ఈరోజు కార్మికులు కనుక విధుల్లో చేరకపోతే మొత్తం ప్రైవేటీకరణ చేస్తానన్న కేసీఆర్ రేపు ఏం చేస్తారన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -