Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణ కు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఇక పండగే..?

- Advertisement -

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు ఐదు నెలల పాటు కరోనా ప్రభావంతో జనసందోహంగా ఉన్న ప్రతి ఒక్కటీ మూసివేశారు. థియేటర్లు, మాల్స్, మద్యం దుకాణాలు, క్లబ్బులు, బార్లు అన్నీ మూసివేశారు. వాటితో పాటు పార్కులు, విద్యావ్యవస్థలు అన్నీ మూసి వేశారు. ఈ మద్య లాక్ డౌన్ ఎత్తి వేసిన నేపథ్యంలో ఒక్కొక్కటీ ఓపెన్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంల దేవాలయలు, షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలు లాంటివి తెరుచుకోగా తాజాగా నేటి నుంచి తెలంగాణాలో బార్లు, క్లబ్ లు తెరవవచ్చంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే బార్లు, క్లబ్ లు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్ లకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

అన్ లాక్ ప్రక్రియలో భాగంగా టీఎస్ ప్రభుత్వం క్రమంగా ఒక్కొక్కదానికి అనుమతి ఇస్తోంది. ఇక సిటి బస్సులు కూడా నిన్నటి నుంచి నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు అన్ని విషయాల్లో తగు సూచనలు ఇస్తూ భద్రత నియమాలు పాటించాలని సూచిస్తుంది ప్రభుత్వం.

తెలంగాణ సర్కార్‌ను నిలదీసిన హైకోర్టు…

తెలంగాణలో కరోనా జోరు.. కొత్తగా 2,176 కరోనా కేసులు!

తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్లపై బీజేపీ గురి.. ?

జంటనగరవాసులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన సిటీ బస్సులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -