Friday, April 19, 2024
- Advertisement -

ట్రంప్‌తో భేటీకీ ముందు అణుప‌రీక్ష‌ల‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌చేసిన కిమ్‌..

- Advertisement -

నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు నిప్పు, ఉప్పులా ఉన్న ట్రంప్‌, కిమ్‌లు మిత్రులుగా మారుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భేటీపై ప్ర‌పంచ దేశాలు అస‌క్తికంగా ఎందురు చూస్తున్నాయి. భేటీకీ ముందే కిమ్ అణుప‌రీక్ష‌ల‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

గతేడాది సుదీర్ఘ అణు పరీక్షలతో ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు కంటిమీద కునుకులేకుండా చేసిన కిమ్, ఆశ్చర్యం కలిగించే మరో ప్రకటన చేశారు. అణు పరీక్షలు నిలిపివేయనున్నట్టు గత నెలలోనే ప్రకటించిన కిమ్, తాజాగా అణ్వాయుధ పరీక్షల కేంద్రాన్ని పేల్చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

మే 23-25 తేదిల్లో అమెరికాతో చర్చలు జరిగే అవకాశం ఉండటంతో దానికి కంటే ముందే అణు పరీక్షల కేంద్రాన్ని పేల్చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. పేలుడు పదార్థాలతో పుంగే-రి అణుపరీక్షల కేంద్రాన్ని పేల్చి వేయనున్నట్టు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

పరిశోధన భవనాలు, సెక్యూరిటీ పోస్టులు, టన్నెల్స్, న్యూక్లియర్ వెపన్ ఇనిస్టిట్యూట్, ఇతర సంస్థలతోపాటు అన్నింటినీ ధ్వంసం చేయనున్నట్టు తెలిపింది.  ఈ కార్యక్రమానికి దక్షిణ కొరియా, చైనా, బ్రిటన్, అమెరికాలకు చెందిన మీడియా ప్రతినిధులు హాజరవుతారు.

మరో మూడు వారాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సింగపూర్‌లో కిమ్ భేటీ కానున్న నేపథ్యంలో అణ్వాయుధ పరీక్షల కేంద్రాన్ని కూల్చివేస్తామని ఉత్తర కొరియా ప్రకటించడం విశేషం. అణ్వాయుధ పరీక్షల నిలపివేసినట్టు ఉత్తర కొరియా ప్రకటించడంపై దక్షిణ కొరియా, అమెరికాలు హర్షం వ్యక్తం చేశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -