Wednesday, April 24, 2024
- Advertisement -

కోడెల కేసులో కొత్త ట్విస్ట్ …కీలక వస్తువు మాయం..

- Advertisement -

కోడెల ఆత్మహత్య చుట్టూ వివాదం నడుస్తోంది. దీనిపై టీడీపీ,వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ప్రాణాలు తీసుకునే కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే అంశం ఇప్పుడు మిస్టరీగా మారింది. కోడెల కూతురు ఫిర్యాదుతో సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన బంజాహిల్స్ పోలీసులు.. విచారణ వేగవంతం చేశారు. ఆత్మహత్యకు ఉపయోటించిన కేబుల్ వైర్‌తో పాటూ కోడెల పంచె, షర్ట్ సీజ్ చేసి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన వ్యక్తిగత ఫోన్ కోసం పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ మేరకు ఆయ నివాసంలో సోదాలు జరిపారు. ఆత్మహత్య అనంతరం పోలీసులు సాధారణ పరిశీలనలో ఆయన పర్సనల్ ఫోన్ కనిపించలేదు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోడెల ఫోన్ స్విచాఫ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కోడెల చనిపోయె ముందు చివరి సారిగా 24 నిమిషాలపాటు ఫోన్ మాట్లాడినట్లు సమాచారం.

కోడెల కాల్‌డేటాను పరిశీలిస్తున్న పోలీసులు.. ఇటు ఆదివారం ఉదయం 8:30కి కోడెల ఫోన్ నుంచి చివరి కాల్ వెళ్లినట్టు గుర్తించారట. గత రెండు రోజులుగా కోడెల ఎవరెవరికి ఫోన్‌ చేశారు.. ఎవరి నుంచి ఆయనకు వచ్చిన కాల్స్‌పై ఆరా తీస్తున్నారు.కోడెల ఆత్మహత్య కేసులో పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో హైడ్‌బోన్ ఫ్యాక్చర్‌తో ఊపిరాడక కోడెల చనిపోయినట్లు తేలినట్లు తెలుస్తోంది.శివప్రసాదరావు అంత్యక్రియల తర్వాత ఆయన కుమారుడిని పోలీసులు ప్రశ్నించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -