Thursday, March 28, 2024
- Advertisement -

జ‌య‌రాం హ‌త్య‌కేసులో శిఖాచౌద‌కి క్లీన్ చిట్…ఇంకా ఏంచెప్పారంటే…?

- Advertisement -

ప్ర‌ముఖ పారీశ్రామిక వేత్త చిగురుపాటి జ‌య‌రాం హ‌త్య‌కేసును ఛేదించారు పోలీసులు. ఈకేసుకు సంబంధించిన నిందితులు రాకేష్‌రెడ్డి, వాచ్‌మెన్‌ శ్రీనివాస్‌ మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టిన ఎస్పీ త్రిపాఠి కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. రాకేష్‌రెడ్డి దగ్గర జయరామ్‌ రూ. 4 కోట్లు అప్పు తీసుకున్నారని చెప్పారు. డబ్బు తిరిగి ఇవ్వాలని జయరామ్‌ని రాకేష్‌ అడిగారని.. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో రాకేష్ రెడ్డి, జయరామ్‌పై దాడి చేసి హత్య చేశారని ఎస్పీ తెలిపారు. సెల్‌ఫోన్. సీసీఫుటేజ్ ఆధారంగా నిందుతుల్ని ప‌ట్టుకున్నామ‌న్నారు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లో ఉన్న ఇంటికి రావాలని… రాకేష్‌రెడ్డి.. జయరామ్‌ని పిలిపించారని, ఇంటికి వచ్చిన జయరామ్‌ను ఆ రోజు రాత్రంతా కొట్టి హింసించారని ఎస్పీ చెప్పారు. నల్లకుంట సీఐ శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో… నిందితులు ఫోన్లో టచ్‌లో ఉన్నారన్నారు.

టెక్రాన్ సంస్థలో సమస్యలు ఉన్న సమయంలో రాకేష్ రెడ్డితో జయరామ్ అప్పు తీసుకొన్నారు. తన డబ్బులు చెల్లించకపోవడంతో రాకేష్ రెడ్డి ప్లాన్ చేశారని చెప్పారు. దానిలో భాగంగానే జయరామ్ కోసం శిఖా ఇంటి వద్ద రాకేష్ రెడ్డి నిఘాను ఏర్పాటు చేశారని చెప్పారు. గత నెల 29వ తేదీన జయరామ్ శిఖా చౌదరి ఇంటికి వెళ్లాడని చెప్పారు. ఈ విషయాన్ని వాచ్‌మెన్ రాకేష్ రెడ్డికి సమాచారం ఇచ్చారని ఎస్పీ తెలిపారు.

ఓ యాంక‌ర్ పేరుతో జయరామ్‌కు రాకేష్ రెడ్డి చాటింగ్ చేశారని ఎస్పీ చెప్పారు. ఈ చాటింగ్ ద్వారా రాకేష్ రెడ్డి ఇంటికి జయరామ్ వెళ్లినట్టు ఎస్పీ తెలిపారు. గత నెల 30 వ తేదీన రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లిన తర్వాత డబ్బుల కోసం కొట్టినట్టు చెప్పారు.అయితే డబ్బుల కోసం జయరామ్‌ను సోఫాపై ముఖం వేసి నొక్కడంతో మృతి చెందారని ఆయన తెలిపారు.

అయితే జ‌య‌రాం హ‌త్య‌లో శ్రిఖా చౌద‌రికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవ‌ని ఎస్పీ వెల్ల‌డించారు. ఈ కేసులో ఇంకా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని ఎస్పీ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -