Thursday, April 18, 2024
- Advertisement -

కుల‌భూష‌న్ జాద‌వ్ మ‌ర‌ణ‌శిక్ష నిలిపివేత‌…అంత‌ర్జాతీయ కోర్టులో భార‌త్ విజ‌యం

- Advertisement -

అంత‌ర్జాతీయ కోర్టులో భార‌త్ విజ‌యం సాధించింది. గూడ‌ఛారా ఆరోప‌న‌ల‌తో మ‌ర‌ణ‌శిక్ష ప‌డిన కుల‌భూష‌న్ జాద‌వ్ కు అనుకూలంగా అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం తీర్పును ఇచ్చింది. పాక్ కోర్టు విధించిన మ‌ర‌ణ‌శిక్ష తీర్పును నిలిపివేసింది. భారత్, పాక్ జడ్జిలు సహా 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పును ప్రకటించారు. పాకిస్తాన్ పునఃసమీక్ష చేసే వరకు కుల్‌భూషణ్‌కు మరణశిక్షను నిలిపివేసింది. భారత్‌కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని ఐసీజే పేర్కొంది. ఐసీజేలో భారత్ కు అనుకూల తీర్పు రావడం పట్ల కేంద్ర వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఇప్ప‌టికే దౌత్య‌ప‌రంగా పాక్‌పై విజ‌యం సాధించిన ఇండియా ఇప్పుడు న్యాయపరంగానూ విజయం సాధించినట్టయింది. 2016లో కుల్‌భూషణ్ జాదవ్‌ను బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. 2017లో పాక్ మిలిటరీ కోర్టు ఏకపక్ష విచారణ జరిపి కుల్ భూషణ్ కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది.

అమాయకుడైన కులభూషణ్ జాదవ్‌‌ను దోషిగా చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ సాగిన తుది విచారణలో భారత్‌, పాకిస్తాన్‌లు తమ వాదనలను న్యాయస్ధానానికి నివేదించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -