Friday, April 26, 2024
- Advertisement -

ఎన్నారైతో పెళ్లి..యువ‌కుడి ర‌చ్చ‌తో అర్ధాంత‌రంగ ఆగిన పెళ్లి..

- Advertisement -

కొద్ది సేప‌ట్లో వ‌ధువు మెడ‌లో తాలి క‌ట్టాల్సిన పెళ్ళికొడుకు. కాని అంత‌లోనె యువ‌కుడి ర‌చ్చ‌తో పందిట్లోనె పెళ్లి ఆగిపోయింది.ఆ యువకుడు ఎవరో తనకు తెలియదని వధువు ఎంత చెప్పినా వరుడు తరపువారు వినిపించుకోకుండా వెళ్లిపోయారు. ఈ ఘటన కర్నూలు జిల్లా డోన్‌లో ఆదివారం జరిగింది.

వివ‌రాల్లోకి వెల్తే…డోన్‌కు చెందిన అమ్మాయికి, ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అబ్బాయితో పెళ్లి కుదిరింది వీరి వివాహం డోన్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పెళ్లి తంతు జరుగుతున్న సమయంలో నంద్యాలకు చెందిన సురేష్ అనే యువకుడు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా వాతావరణం ర‌చ్చ ర‌చ్చ‌గా మారిపోయింది.

పెళ్లి ఫంక్షన్ హాల్‌కి వచ్చిన ఓ కుర్రాడు నానా ర‌చ్చ చేశారు. పెళ్లి ఆపండి అని గట్టిగా ఆరిచాడు. అంతే ఒక్క సారిగా బాజా భ‌జంత్రీలు ఆగిపోయాయి. అందరూ ఆ కుర్రాడివైపే చూడసాగారు. పెళ్లి కూతురూ, తానూ ప్రేమించుకున్నామనీ, తమ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలని అన్నాడు. అందరూ షాకయ్యారు. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదనీ, బలవంతంగా చేస్తున్నారనీ, ఇది అన్యాయమనీ నానా రభసా చేశాడు. అంతే కాదు… పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానని పెళ్లికొడుక్కి వార్నింగ్ ఇచ్చాడు.

వధువు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చిన యువకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత వధువు కుటుంబానికి పెళ్లికొడుకు షాకిచ్చాడు. ఏంటి ఇది అని వధువుని అడిగాడు. ఆమె తనకు ఏమాత్రం సంబంధం లేదనీ, అతనెవరో తాను ఎప్పుడూ చూడలేదని చెప్పింది. అయినప్పటికీ వరుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో పెళ్లికుమారుడి తరపు వారు పెళ్లి రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవంతో వధువు కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -