Friday, April 19, 2024
- Advertisement -

వైసీపీలో చేరిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే …

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకీ ఇంకా షాక్‌లు త‌గులుతున్నాయి. నామినేష‌న్లు వేస్తున్నా వైసీపీలోకి నేత‌ల వ‌ల‌స‌లు ఆగ‌డంలేదు. తాజాగా వైసీపీనుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్‌రెడ్డి సొంత గూటికి చేరుకున్నారు. లోటస్‌ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కండువా కప్పి ఎస్వీని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మ‌రో సారి త‌న‌కే టికెట్ కేటాయిస్తార‌నిపెట్టుకున్న ఆశ‌ల‌పై బాబు నీళ్లు చ‌ల్లారు. ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా మొండిచేయి చూపారు. మ‌న‌స్థాపం చెందిన ఎస్వీ వైసీపీలో కండువా క‌ప్పుకున్నారు.

పార్టీలో చేరిన సంద‌ర్భంగా బాబుక‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తనను టీడీపీ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బేషరతుగా వైసీపీలో చేరుతున్నట్లు ఎస్వీ తెలిపారు. కర్నూలు అసెంబ్లీలో వైసీపీని గెలిపించి తీరుతానని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. టికెట్ ఇస్తాన‌ని చెప్పి బాబు మాట‌త‌ప్పార‌ని విమ‌ర్శించారు.పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా.. వైసీపీలో చేరానని వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఎలాంటి అన్యాయం చేయలేదని, తామే పార్టీ మారి అన్యాయం చేశామని ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. త‌న స‌త్తా ఎంటో చూపిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

గుంటూరు జిల్లాలో కూడా టీడీపీకి బిగ్ షాక్ త‌గిలింది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో కమల వైసీపీలో చేరారు. రాష్ట్రం అభివృద్ధి చేస్తా అని అధికార దాహంతో వంచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నార‌ని.. ఆయన కుటుంబం, అబ్బాయి కోసమే నాటకాలు వేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు బీసీకే మంగళగిరి ఇస్తా అని నమ్మించి మాట తప్పారు, చంద్రబాబు ఎన్నటికీ మారడని కమల మండిపడ్డారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -