Friday, April 26, 2024
- Advertisement -

బాబుకు షాక్ ఇచ్చి క‌ర్నూలు జిల్లా నేత‌లు…అంత లోకువా…!

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలింగ్ పూర్త‌య్యింది. ఫ‌లితాలు ఇంకా రాలేదు. ఆప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు కొనసాగుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు నేత‌ల‌కు చుక్క‌లు చూపించిన బాబుకు ఇప్పుడు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. సీన్ క‌ట్ చేస్తే….ఇప్పుడు చంద్ర బాబుకె నేత‌లు చుక్క‌లు చూపిస్తున్నారు. ఒక ప‌క్క ఈసీ బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంటె….మ‌రో ప‌క్క నేత‌లు అప్పుడే షాక్ ఇస్తున్నారు.

ఆప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా ఉండ‌గానె …తాజాగా క‌ర్నూలు జిల్లా ఎమ్మెల్యే అభ్య‌ర్ధులు బాబుకు బిగ్ షాక్ ఇచ్చారు. క‌ర్నాట‌క‌లో ఎన్నిక‌ల ప్రాచారం నిమిత్తం వెల్తున్న బాబు క‌ర్నూలు జిల్లాలో దిగిన బాబు పార్టీ తరపున పోటీ చేసిన వారితో ఎన్నిక‌ల స‌ర‌ళి ఎలా జ‌రిగింద‌నె సమీక్ష నిర్వహించాలని భావించారు.

ఇందుకు సంబంధించి పార్టీ నేతలకు ముందస్తుగానే సమాచారం అందించింది టీడీపీ నాయకత్వం. అయితే బాబు స‌మీక్ష స‌మావేశానికి నిర్వహించిన సమీక్షా సమావేశానికి కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు, పార్టీ తరపున పోటీ చేసిన ఎంఎల్ఏ అభ్యర్ధులు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖరరెడ్డి, కెఈ శ్యాంబాబు, టిజి భరత్, తిక్కారెడ్డి, మీనాక్షీ నాయుడు, కెఈ ప్రతాప్ బాబు స‌మీక్షా స‌మావేశానికి డుమ్మా కొట్టారు.

దీంతో చేసేదేముందని హాజరైన నేతలతోనే చంద్రబాబు ఏదో మొక్కుబడిగా సమీక్ష జరిపి….టీడీపీనె మ‌రో సారి అధికారంలోకి వ‌స్తుంద‌ని స‌మీక్షా స‌మావేశానికి హాజ‌ర‌యిన నేత‌ల్లో ఉత్సాహం నింపారు. దీన్ని బ‌ట్టి చూస్తె టీడీపీ అధికారంలోకి రాద‌ని అప్పుడే నేత‌ల‌కు అర్థం అయిన‌ట్లుంది. లేక పోతె సీఎం జిల్లా కు వ‌స్తె క‌నీసీ ఒక్క ఎమ్మెల్యే అభ్య‌ర్ధికూడా క‌ల‌వ‌క పోడం చూస్తె అప్పుడే ఆయ‌న‌కు సీన్ అర్థం అయిన‌ట్లుంది. పాపం అధికారం చివరలో నేతలు చంద్రబాబు గట్టి షాకే ఇచ్చారు. ఇంకా కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క‌ముందె బాబు నేత‌ల‌కు అంల చీఫ్ అయ్యారా అనె గుస‌గ‌స‌లు వినిపిస్తున్నాయి. సమావేశానికి వచ్చిన నాయకులతోనే వివరాలు అడిగి తెలుసుకుని అనంతరం ఎయిర్‌ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాకు సీఎం బయలుదేరి వెళ్లారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -