Thursday, April 25, 2024
- Advertisement -

ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఇప్పుడు అంద‌రిలోను ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌ధానంగా పోటీ టీడీపీ, వైసీపీ మ‌ధ్య‌నే అన్న సంగ‌తి తెలిసిందె. గెలుపు మాదంటె మాదే న‌నే ధీమాలు ఇరు పార్టీ నేత‌లు ఉన్నారు. అన్ని స‌ర్వేలు వైసీపీకే అనుకూలంగా ఉండ‌గా తాజాగా ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఫ‌లితాల‌పై ల‌గ‌డ‌పాటి వ్యాఖ్య‌లు చూస్తె అధికార పార్టీ టీడీపీకే అనుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అమెరికాలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ల‌గ‌డ‌పాటి స‌ర్వే వివ‌రాల‌ను మే 19న చెబుతానని స్ప‌ష్టం చేసారు. సంక్షేమం, అభివృద్ధి చేసిన వారికే ప్రజలు పట్టం కడతారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తన సర్వే ఎందుకు లెక్క తప్పిందో ఆరోజున చెబుతానని అన్నారు.

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఘోరంగా విఫ‌లం అయిన సంగ‌తి తెలిసిందే.ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ల‌గ‌డ‌పాటి స‌ర్వేల‌కు అంత‌గా ప్రాధాన్య‌త లేద‌నే వాద‌న ఉంది. ఈ ప‌రిస్థితుల్లో తాజాగా ల‌గ‌డ‌పాటి చేసిన ఈ వ్యాఖ్య‌ల‌తో మ‌రో సారి రాజ‌కీయంగా చ‌ర్చ మొద‌లైంది.

పోలింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఉద‌యానికి..సాయంత్రానికి టిడిపి వ్యూహాల్లో మార్పు క‌నిపించింది. ప్ర‌జ‌లంతా పోలింగ్ బూత్‌ల‌కు త‌ర‌లి రావాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌త్యేకించి మ‌హిళ‌లు పోలింగ్ బూత్‌ల‌కు వ‌చ్చేలా ప్ర‌య‌త్నాలు చేసారు. ఇక‌, మ‌హిళ‌లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొన‌టం ద్వారా త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని టిడిపి నేత‌లు అంచ‌నాకు వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి వ్యాఖ్య‌లు కూడా టిడిపికి అనుకూలంగా ఉండ‌టంతో తెలుగు త‌మ్ముళ్లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.మ‌రి ల‌గ‌డ‌పాటి స‌ర్వే నిజం అవుతుందా లేకుంటె తెలంగాణాలో మాదిరి బోల్టాప‌డుతుందో చూడాలి…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -