Saturday, April 20, 2024
- Advertisement -

విశాఖ లో అడుగుపెట్టిన భూబకాసురులు..?

- Advertisement -

రాజధాని ప్రకటన కాకముందునుంచే అమరావతిలో టీడీపీ చేసిన భూ దందాలా వ్యవహారం అందరికి తెలిసిందే.. పలనా చోట రాజధాని వస్తుందని చెప్పి తన పచ్చ బ్యాచ్ ని ముందుగానే అక్కడికి పంపించి చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డ సంగతి అందరికి తెలిసిందే.. అయితే ఇప్పుడు జగన్ దానిపై విచారణ జరిపిస్తుండగా టీడీపీ లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వారిలో టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో వైసీపీ కి రాయబారులను పంపడం ఇప్పుడు ఒకింత ఆశ్చర్యంగా మారింది.. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్ అసలు రాజధాని ని అక్కడినుంచి విశాఖ కు మార్చేయడం టీడీపీ వారికి ససేమీరా మింగుడు పడడం లేదు.. అప్పటినుంచి తమ స్వప్రయోజనాలకు ధర్నాలు చేస్తూ తమ పరువును తామే తీసుకుంటున్నారు..

ఇక అమరావతి రాజధాని సమస్య దాదాపు గా ముగుస్తున్న వేళా విశాఖ లో భూ దందా రోజు రోజు కు ఎక్కువైపోతుందని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు.. గతంలో కూడా విశాఖ భూ స్కాం లకు పెట్టింది పేరు.. గత ప్రభుత్వ హయాం నుండే అక్కడి నేతలు  విశాఖ లో భారీగా భూదందాలు చేస్తూ విమర్శల పాలయ్యారు..ఈ భూ స్కాం ల వల్ల  ప్రజలు ఎంత ఇబ్బందిపడ్డారో అందరికి తెలిసిందే.. ఇప్పుడు కూడా పరిపాలనా రాజధాని అని జగన్ ప్రకటించారో లేదో విశాఖలో ఒక్కసారిగా భూములకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే భూముల కొరత ఎక్కువగా ఉండడంతో మిగిలి ఉన్న అతి తక్కువ భూములలో కూడా ఇపుడు దందా జరుగుతోంది..

ఇక విశాఖ లో పెత్తనం అంతా విజయ సాయి రెడ్డి దే అని అందరికి తెలుసు.. ఆయన విశాఖలో దురాక్రమణకు గురి అయిన భూములను తిరిగి ప్రభుత్వం ఖాతాలోకి వచ్చేలా చూస్తామని చెబుతున్నారు. కబ్జా కి పాల్పడినవారు తమ పార్టీ వారైనా వదిలేది లేదని అంటున్నాడు..  భూ దందాలకు గురి అయిన భూములను వెనక్కు తీసుకుంటామని చెబుతున్నారు, ఈ నేపథ్యంలో విశాఖ లో భూముల వ్యవహారం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో అర్థం కావట్లేదు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -