Wednesday, April 24, 2024
- Advertisement -

మందు ప్రియుల‌కు ఏపీ ప్ర‌భుత్వం బ్యాడ్ న్యూస్‌…

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ద‌శ‌ల‌వారీగా మ‌ద్య‌పానం చేస్తామ‌ని ఇచ్చిన హామీపై జ‌గ‌న్ దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే బెల్ట్ షాప్‌లు లేకుండా చేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన జ‌గ‌న్ మ‌రో సారి మందుబాబుల‌కు బిగ్ షాక్ ఇచ్చారు. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానున్న సంగ‌తి తెలిసిందే. కొత్త పాల‌సీ ప్ర‌కారం చీప్ లిక్కర్ నుంచి హై క్లాస్ బ్రాండ్ వరకు ఏదీ వదలకుండా.. అన్ని బ్రాండ్లపై భారీగా వడ్డించేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

కొత్త విధానంలో క్వార్టర్ కనీసం రూ. 50కి పెరగనున్నట్టు సమాచారం. చీప్ లిక్కర్ దగ్గర నుంచి ఖరీదైన బ్రాండ్ల వరకు భారీగా వడ్డించనున్నారు. నేరుగా ప్రభుత్వమే మద్యం అమ్మకాలను చేపట్టనుంది. అయితే, ఈ సారికి బార్లకు మినహాయింపే ఉంటుంది.. బార్లకు 2022 మార్చి 31 వరకు ఎటువంటి మార్పు ఉండబోదు. ఆ తర్వాత వాటిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -