Friday, March 29, 2024
- Advertisement -

ట్విట్టర్ లో ప్రత్యక్షమైన తాబేలు .. ఎందుకంటే ..?

- Advertisement -

సాధారణంగా తాబేలు నిధానంగా వెళుతుంది.ఇది మనం కథలో విన్నాం లేదా ఏ టీవీలోనో,జూ లోనో లేకుంటే వాటిని పెంచుకుంటున్న మన ఫ్రెండ్స్ ఇళ్ళలోనో చూస్తుంటాం.కాని తాజాగా దీనికి పూర్తి విరుద్ధంగా వేగంగా నడిచే తాబేలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది.దీనితో అతి తక్కువ టైంలో ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.అందులోని తాబేలు బాగా ఫేమస్ అయ్యింది.మరి కథేంటో ఇప్పుడు చూద్దాం.

ఎర్త్ బ్యూటీ అనే ట్విట్టర్ ఖాతాలో తాజాగా ఓ 13సెకండ్స్ వీడియో పోస్ట్ అయ్యింది.అందులో ఓ తాబేలు దూరం నుండి కెమెరా వైపు వేగంగా వస్తుంది.మరి తాబేలు అంత వేగంగా ఎలా మూవ్ అవుతుందంటే ఆ తాబేలను ఒక బొమ్మ కార్ మీద అమర్చారు…అందువల్లే ఆ తాబేలు  వేగం పెరిగిందనే విషయం బయటపడింది.

ఇక ఈ వీడియో చూసిన వారంతా చిన్నప్పుడు తాబేలు,కుందేలు కథలోని విషయాలను గుర్తు తెచ్చుకుంటున్నారు.ఈ తాబేలు మళ్లీ రేసుకి సిద్ధం అవుతున్నట్లు ఉంది అంటూ ఆసక్తికర  కామెంట్స్ చేస్తున్నారు.మరి మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్ వేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -