Thursday, April 25, 2024
- Advertisement -

లడఖ్ సరిహద్దుల్లో హైటెన్షన్….భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ

- Advertisement -

లధాఖ్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ,చైనా సైనికుల మధ్య ఘర్షన తలెత్తింది. భారత్, చైనాల మధ్య దాదాపు మూడు నెలలు డోక్లాం వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా, తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైన్యం మధ్య వివాదం నెలకుంది. ఇరు దేశాల సైనికులు పరస్పరం తోసుకున్నారు.ఇరుదేశాల సైన్యం తరఫున ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరగడంతో ఇక్కడ ఉద్రిక్తత సమసిపోయింది.

అరుణాచల్‌ప్రదేశ్‌లో వచ్చే నెలలో ఇంటిగ్రేటెడ్ పోరాట సమూహాం (ఐబీజీ) నైపుణ్యాల ప్రదర్శనకు భారత సైన్యం సిద్ధపడుతోన్న తరుణంలో లడఖ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దానిలో భాగంగానె లడఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.ఈ ప్రాంతంలోని రెండొంతల భాగాన్ని చైనా ఇప్పటికే ఆక్రమించుకోగా, మిగతా ప్రదేశంలోకి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబడింది. దీంతో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం తమ భూభాగంలోకి చొరబడిన వారిని అడ్డుకుంది.

అయితే, బ్రిగేడియర్ స్థాయి అధికార ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలతో ఈ వివాదం ముగిసిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇరు వర్గాలు వెనక్కు వెళ్లేందుకు అంగీకరించాయని పేర్కొన్నాయి. లడఖ్-టిబెట్ మధ్య ఉన్న పాంగాంగ్ సరస్సు తమదంటే, తమదని భారత్-చైనాలు పట్టుబడుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరైన సరిహద్దు లేకపోవడం, ప్రస్తుతం ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను చైనా గుర్తించకపోవడంతో భారత్-చైనా సైన్యాల మధ్య తరచూ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి.

హిమ విజయ్’ పేరుతో అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత సైన్యం ఐబీజీ నిర్వహించే సమయంలో చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్ భారత పర్యటనకు రానున్నారు. తొలిసారి మోదీ, జిన్‌పింగ్‌లు 2018 ఏప్రిల్‌లో యుహూన్‌లో భేటీ అయ్యారు. డోక్లాం వివాదం తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం అదే తొలిసారి.సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయానికి వచ్చారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -