Friday, April 26, 2024
- Advertisement -

లాక్ డౌన్.. అదే పనిగా రొమాన్స్.. 70లక్షల మందికి గర్భం…!

- Advertisement -

ఏదైన భారి పరిణామం జరిగితే.. అందుకు తగిన విధంగా మరిన్ని పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. ఎప్పుడు లేని విధంగా కంటికి కనిపించని ఓ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎవరు బయట తిరగకుండా చేసింది. ఎన్ని రోజులు ఇంకా ఇంట్లోనే ఉండాలో తెలియని పరిస్థితి వచ్చింది. మరింత కాలం ఈ లాక్ డౌన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయనే క్రమంలో షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళల మీద తీవ్ర ప్రభావం పడుతోందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని ఐక్యరాజ్య సమితి తాజాగా వెల్లడించింది. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది మహిళలు.. వారు కోరుకోకుండానే గర్భధారణ జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ తాజాగా చేసిన పరిశోధనలో లాక్ డౌన్ వేళ మహిళలు కుటుంబ నియంత్రణ పద్దతులకు దూరం కావటంతో భారీ ఎత్తున గర్భధారణ జరగనుందని తేల్చింది. లాక్ డౌన్ మరో ఆరు నెల్లు కొనసాగితే ఇలాంటి అవాంఛిత గర్బాల సంఖ్య ఏకంగా 4.7 కోట్లకు చేరుకునే వీలుందని చెబుతున్నారు.

అంతేకాకుండా లాక్ డౌన్ వల్ల మహిళలు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారని ఈ రిపోర్టు తెలిపింది. బాలికలపై వేధింపులు.. గృహహింస వంటివి ఎక్కువయ్యాయని యూఎన్ఎఫ్ పీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కానెమ్ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ వల్ల కొన్ని జంటలు అదే పనిగా రొమాన్స్ లో మునిగి తెలుతున్నారని.. గర్భధారణ నిరోధించే పిల్స్.. కండోమ్ లకు కొరత ఏర్పడ్డాయి. దీంతో.. గర్భనిరోధకాలు లేకుండానే రొమాన్సు చేస్తున్న కారణంగా మహిళలు అవాంఛనీయ గర్భధారణకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -