Tuesday, April 16, 2024
- Advertisement -

ఇండియా టుడే స‌ర్వేలో దేశంలో అగ్ర‌స్థానంలో వైసీపీ…అడ్ర‌స్ గ‌ల్లంత‌యిన టీడీపీ

- Advertisement -

ఆధ్ర‌ప్ర‌దేశ్ గ‌త‌నెల 11న అసెంబ్లీ, లోక్ స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు ముగిసిన వ‌ష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ , టీడీపీ హోరా హోరీగా త‌ల‌ప‌డ్డాయి. ఫ‌లితాలు ఈ నెల 23న వెలువ‌డ‌నున్నాయి. అన్ని స‌ర్వేలు వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చ‌డంతో జ‌గ‌న్ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇద‌లా ఉంటె పార్టీ త‌రుపున నిల‌బ‌డిన అభ్య‌ర్థుల చదువు వివ‌రాల‌పై ఇండియా టుడే గ్రూప్ ఇంటలిజెన్స్ యూనిట్ ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. ఈ స‌ర్వేలో జాతీయ పార్టీల‌కు షాక్ ఇచ్చేవిధంగా ఫ‌లితాలు వ‌చ్చాయి.

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థుల చదువు, అర్హతలను సర్వే చేసింది. అభ్య‌ర్ధులంద‌రూ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ వివ‌రాల ప్ర‌కారం ఈస‌ర్వే చేసింది.ఇందులో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. స‌ర్వేలో జగన్ నేతృత్వంలోని వైసీపీ దేశంలోనే తొలిస్థానంలో నిలిచినట్లు ఇండియా టుడే గ్రూపు తెలిపింది. వైసీపీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 88 శాతం మంది డిగ్రీ, లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నారని చెప్పింది.

ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన డీఎంకే 87.5 శాతం డిగ్రీ హోల్డర్లతో రెండో స్థానంలో నిలవగా, అన్నాడీఎంకే 86.4 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. ఇక తెలంగాణాలో టీఆర్ఎస్ 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో తొలిస్థానంలో, దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది.దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో ఈసారి 139 మంది నిరక్షరాస్యులు బరిలో ఉన్నట్లు ఇండియాటుడే ఇంటెలిజెన్స్ యూనిట్ చెప్పింది. ఈ స‌ర్వేలో టీడీపీ ప్ర‌స్థావ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -